సమీక్ష : ” నారాయణ & కో ” – కొన్ని నవ్వులు మాత్రమే

సమీక్ష : ” నారాయణ & కో ” – కొన్ని నవ్వులు మాత్రమే

Published on Jul 1, 2023 3:02 AM IST
Narayana & Co Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 30, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సుధాకర్ కొమకుల, ఆమని, దేవి ప్రసాద్, ఆరతి పొడి, యామిని బి, పూజా కిరణ్, జై కృష్ణ, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్

దర్శకుడు : చిన్న పాపిశెట్టి

నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్ & సుధాకర్ కోమాకుల

సంగీతం: డా. జోస్యభట్ల శర్మ, నాగ వంశీ, సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్

ఎడిటర్ : సృజన అడుసుమిల్లి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన మరో చిన్న ఎంటర్టైనర్ చిత్రం “నారాయణ&కో”. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమకుల హీరోగా దేవి ప్రసాద్ తదితరులు నటించిన చిత్రం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే..నారాయణ(దేవి ప్రసాద్) అనే ఓ కుటుంబ పెద్ద తన ఇద్దరు కొడుకులు ఆనంద్(సుధాకర్ కొమకుల) అలాగే సుభాష్(జై కృష్ణ) లతో అయితే చాలా సాధారణ జీవితం గడుపుతాడు. మరి డబ్బులు బాగా అవసరం ఉండే కుటుంబంలో ఆనంద్ బెట్టింగ్స్ లో చాలా డబ్బు పోగొట్టుకుంటాడు. మరి ఈ క్రమంలో ఆనంద్ ది ఓ ప్రైవేట్ వీడియో ఉందంటూ ఒక బ్లాక్ మైలర్ అతన్ని డబ్బులు డిమాండ్ చేస్తాడు మరోపక్క నారాయణకు కూడా ఊహించని ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఈ కష్టతర పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ ఎలాంటి డెసిషన్ తీసుకుంది? వారు ఈ డబ్బుల బాధ నుంచి బయట పడతారా పడితే ఎలా బయటకొస్తారు అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో అక్కడక్కడా కనిపించే కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయి. అలాగే సినిమాలో కనిపించే పాత్రలు కూడా డీసెంట్ గా కనిపిస్తాయి వాటిని ప్రెజెంట్ చేసిన విధానం అయితే బాగుంది. ఇక సీనియర్ నటులు దేవి ప్రసాద్ అలాగే నటి ఆమని లు మంచి స్క్రీన్ స్పేస్ దక్కించుకుని మంచి నటన కనబరిచారు.

అలాగే వారి మధ్య కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇక యంగ్ నటుడు సుధాకర్ ఎప్పటిలానే మంచి నటన సెటిల్డ్ గా కనబరిచాడు. అలాగే మరో నటుడు జై కృష్ణ కూడా మంచి నటన కనబరిచాడు. మెయిన్ గా తన వన్ లైనర్స్ బాగున్నాయి. ఇక ఇతర నటులు పూజా కిరణ్, శివకుమార్ యామిని తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కథ ఆల్రెడీ ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. దీంతో లైన్ లో ఎలాంటి కొత్తదనం లేకపోగా చాలా వరకు సీన్స్ బోర్ గా కొనసాగుతాయి. ఇక ఫస్టాఫ్ అలా అక్కడక్కడా కామెడీ ఉంటుంది కానీ సెకండాఫ్ మరింత బోర్ గా సాగుతుంది. ఇంకా సినిమాలో సాంగ్స్ అయితే అనవసరం అనిపిస్తుంది.

నార్మల్ గా ఉన్న సినిమానే ఒకింత బోర్ ఫీల్ ఇస్తే మధ్యలో సంబంధం లేకుండా వచ్చే పాటలు మరింత బోర్ గా అనిపిస్తాయి. ఇక నటుల్లో అలీ రెజా, హీరోయిన్ ఆర్తి లకు సరైన ఇంపార్టెన్స్ కూడా కనిపించదు. అలాగే సినిమాలో కనిపించే కొన్ని రొటీన్ కామెడి సీన్స్ ఓవర్ గా అయిపోవడం మూలాన అవి కూడా బోర్ ఫీల్ తెప్పిస్తాయి. సెకండాఫ్ అంతా కూడా అలా సాగదీతగా కూడా అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమా సెటప్ సెట్ వర్క్స్ నాచురల్ గా ఉన్నాయి. ఇక టెక్నీకల్ టీం లో నాగ వంశీ, సురేష్ బొబ్బిలి, జోశ్యభట్ల శర్మ ల సాంగ్స్ బాగున్నాయి కానీ సినిమాలో వాటి ప్లేస్ మెంట్ బాగోలేదు. అలాగే రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక ఎడిటింగ్ అయితే బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు చిన్న పాపిశెట్టి విషయానికి వస్తే..తాను రొటీన్ కథనే ఎంచుకున్నా సినిమాలో ఫస్టాఫ్ పర్వాలేదనిపించే స్థాయిలో హ్యాండిల్ చేసాడు. కానీ, సెకండాఫ్ పూర్తిగా గాలికొదిలేసినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ కూడా బాగా తెరకెక్కించి ఉంటే మరికాస్త బెటర్ ఎంటర్టైన్మెంట్ ని ఈ చిత్రం అందించే ఛాన్స్ ఉంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “నారాయణ&కో” చిత్రం ఓ రొటీన్ బోరింగ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ నటన, అక్కడక్కడా కామెడీ ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ బాగా బోర్ గా సాగుతుంది. దీనితో జస్ట్ కొన్ని నవ్వులు వరకు మాత్రమే పర్వాలేదు అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు