సమీక్ష : హాస్టల్ డేస్ – అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెబ్ సిరీస్

సమీక్ష : హాస్టల్ డేస్ – అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెబ్ సిరీస్

Published on Jul 14, 2023 11:00 AM IST
Hostel Days Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 13, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: దరహాస్ మాటురు, అక్షయ్ లగుసాని, మౌళి తనూజ్ ప్రశాంత్, అనన్య అకుల, ఐశ్వర్య హోల్లకల్, జైత్రి మకానా తదితరులు.

దర్శకుడు : ఆదిత్య మండల

నిర్మాతలు: అనురభ్ కుమార్

సంగీతం: సిద్దార్థ సదాశివుని

సినిమాటోగ్రఫీ: ఫహాద్ అబ్దుల్ మజీద్

ఎడిటర్ : వినయ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ హాస్టల్ డేజ్ తెలుగులో హాస్టల్ డేస్ పేరుతో రీమేక్ చేయబడింది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. అది ఎలా ఉందో తెలుసుకుందాం.

 

కథ :

హాస్టల్ డేస్ అనేది ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు వారి హాస్టల్ జీవితంలోని అనుభవాల గురించి సాగే సిరీస్ . సాయి (దరహాస్ మాటూరు), చిత్రరంజన్ భట్టాచార్య (మౌళి), మరియు నవీన్ యాదవ్ (అక్షయ్ లగుసాని) రూమ్‌మేట్స్. నాలుగు సంవత్సరాల పోరాటం తరువాత, తెప్ప తన అడ్మిషన్ పొందుతాడు. కావ్య (ఐశ్వర్య హొల్లకల్) మరియు రితిక (జైత్రి మకానా) విరుద్ధమైన వ్యక్తులు కూడా ఈ కథలో భాగమే. ఈ ఆరుగురు వ్యక్తులు తమ హాస్టల్ జీవితంలో ఏమి అనుభవించారు అనేది కథ యొక్క మిగతా సారాంశం.

 

ప్లస్ పాయింట్స్ :

కళాశాల హాస్టల్‌లో ఉంటూ వారి విద్యను అభ్యసిస్తున్న వారికి, ఈ సిరీస్ బాగానే ఉంటుంది. ఇతరులకు, ఇది అక్కడక్కడ కొంతవరకు చూడదగినదిగా. కథనంలో లోపాలు ఉన్నప్పటికీ హాస్టల్ జీవితాన్ని చిత్రీకరించే ప్రయత్నం అభినందనీయం. ఝాన్సీ మరియు రాజీవ్ కనకాల క్యామియోలు చక్కగా ఉన్నాయి. సాయి పాత్రను డిజైన్ చేసిన విధానం సిరీస్ లో మంచి భాగం. చాలా మంది ఈ ప్రత్యేక పాత్రతో సంబంధం కలిగి ఉంటారు మరియు దరహాస్ మాటురు మాత్రం తన పాత్రకు ప్రాణం పోశాడు. తన సహజమైన నటన ఈ సిరీస్‌కి అతిపెద్ద బలం. ఇక సిరీస్ మధ్య భాగం నుండి ఆసక్తికరంగా మారుతుంది. సాయి ప్రేమకథ పాయింట్ తో సాగుతుంది. ఈ సీక్వెన్స్‌లు కొంత ఆకట్టుకునేవిగా ఉంటాయి. చివరి ఎపిసోడ్ వినోదాత్మకంగా ఉంది, విద్యార్థులు పరీక్షరోజుకు ముందు చదువుకోవడం ద్వారా వారి ఎమ్ 1 పరీక్షను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మౌళి తనూజ్ ప్రశాంత్ తన చక్కని నటనతో ఆకట్టుకున్నారు. అక్షయ్ లగుసాని, అనన్య అకుల, ఐశ్వర్య హొల్లకల్, జైత్రి మకానా తమ తమ పాత్రల్లో భాగం ఒదిగిపోయి నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

ముందుగా సిరీస్ అయితే నెమ్మదిగా ప్రారంభమవుతుంది మరియు కథనం మధ్య భాగాల వరకు అలానే సాగుతుంది. మొదటి రెండు ఎపిసోడ్‌లలో పెద్దగా ఏమీ జరగదు. ర్యాగింగ్ వంటి సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు యువకులకు సమస్య కానప్పటికీ, అవి ఇతర వర్గాల ప్రేక్షకులకు సమస్యాత్మకంగా ఉండవచ్చు, తద్వారా సిరీస్ కొందరికే నచుతుంది. ఇక మౌళి బాగా చేసాడు, కానీ అతని స్క్రీన్ సమయం పరిమితంగా ఉంది, మరియు సిరీస్ లో అతని పాత్ర మరింతగా చేర్చి ఉంటె బాగుండేది. కొన్ని జోకులు బాగానే ఉన్నా, కొన్ని అంతగా ఆకట్టుకోవు. రెండవ ఎపిసోడ్, ది రక్షకుడు బోరింగ్‌గా ఉంది మరియు ఉద్దేశించిన విధంగా నవ్వు తెప్పించలేదు. క్యారెక్టర్స్ ని మరింత బలంగా రాసుకుని ఉండాల్సింది.

 

సాంకేతిక వర్గం :

సిద్ధార్థ సదాశివుని సంగీతం బాగుంది, మరియు సిరీస్ లో ఒక పాట కూడా ఉంది. ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మూడో ఎపిసోడ్ నుండి ఎడిటింగ్ బాగుంది. ఆదిత్య మండల దర్శకత్వం బాగానే ఉంది. తన జీవితాన్ని తను కోరుకున్న విధంగా జీవించే ప్రయత్నం కోసం ప్రదర్శించే మహిళా అంతర్గత స్వభావ సన్నివేశాలు బాగున్నాయి. ఈ అంశం ప్రశంసనీయం. నటీనటుల ఎంపిక కూడా బాగానే ఉంది, అయితే మొదటి రెండు ఎపిసోడ్‌లు ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది. హాస్యం భాగాలుగా ఆనందదాయకంగా ఉంటుంది కానీ మొత్తంగా కాదు.

 

తీర్పు :

మొత్తం మీద, హాస్టల్ డేస్ అక్కడక్కడ ఆకట్టుకుంటూ సాగుతుంది. నటీనటులందరూ బాగా నటించారు, కానీసిరీస్ మధ్య భాగాల నుండి మాత్రమే మంచి ఫెజ్ ని అందుకుంటుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగుంటే మరికొన్ని కొన్ని బాగాలేవు. అందువల్ల ఈ వారాంతంలో హాస్టల్ డేస్ పర్వాలేదనిపించేదిగా నిలుస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు