శేఖర్ సూరి దర్శకత్వం వహించిన ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమా 8 సంవత్సరాలకు ముందు విడుదలై మంచి విజయాన్ని సాదించింది. దీనికి సిక్వెన్స్ గా నిర్మించిన ‘అరవింద్ -2’ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, కమల్ కామరాజు, మాధవీ లత, అడోనికా, శ్రీ లు నటించారు. శ్రీ విజయభేరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
ఒక సినిమా నిర్వాహక బృందం దండేలి ఫారెస్ట్ లో షూటింగ్ నిర్వహించడానికి వెళ్తారు. హీరో (కమల్ కామరాజు), సెకండ్ హీరో (శ్రీ ), హీరోయిన్ (అడోనికా ), డైరెక్టర్( శ్రీనివాస్ అవసరాల), నిర్మాత (యాంకర్ విజయ్ ) లు ఒక గెస్ట్ హౌస్ ని రెంట్ కి తీసుకుంటారు. మిగిలిన వారికోసం ఉదయం వరకు వేచి ఉండవలసి వస్తుంది. ఆ అడవిలో ఒక సైకోటిక్ కిల్లర్ తిరుగుతూ ఉంటాడు. అతని ఆశయం అతనికి తెలియని వారు ఎవరైనా తన దారిని దాటి వెళితే చంపుతూ వుంటాడు. మీరు వుహించినట్టుగానే ఈ సైకోటిక్ కిల్లర్ ఈ చిత్ర నిర్వహణ బృందాన్ని ఒక్కోక్కరిని చంపుతూ ఉంటాడు. ఈ చిత్ర నిర్వహణ బృందం నుండి శ్రీ విడిపోతాడు. అలా విడిపోయిన శ్రీ తను మిస్ అయిన ఫ్రెండ్స్ ని వెతుకుతూ వుంటాడు. చివరికి ఏం జరిగింది? వారు ఈ సైకోటిక్ కిల్లర్ నుండి బ్రతికి బయట పడ్డారా ?లేదా? అసలు ఎందుకు వీళ్ళని చంపుతున్నాడు? అన్నది తెలుసు కోవాలంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమా నిర్మించడం కోసం ఈ చిత్ర టీం చాలా కష్టపడ్డారు. కథకు తగినట్టుగా లోకేషన్స్, సహజంగా నటించడం కోసం చాలా కష్ట పడ్డారు. శ్రీనివాస్ అవసరాల, కమల్ కామరాజు , బెనర్జీ నటన బాగుంది. మాధవీ లత చూడడానికి బాగుంది. అడోనికా నటన పరవాలేదనిపించేలా ఉంది. ఒకటి, రెండు కిల్లింగ్ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి. ఇంటర్వల్ కు ముందు సినిమా కాస్త వేగంగా సాగింది. కొన్ని సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే చాలా దారుణంగా ఉంది, రచన కూడా అస్సలు బాగోలేదు. మామూలుగా మీ టీం లోని మెంబర్స్ మిస్ అవుతుంటే మిగతావారు వారికి ఏమైంది, ఎలా ఉన్నారో అని భాధపడే సన్నివేశాలను ఆశిస్తారు కానీ ‘అరవింద్ 2’ టీంలోని వారికి అవి చెప్పి చేయించుకోవడం మరిచిపోయారు. ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ పోతున్న సమయంలో దానికి తగ్గట్టుగానే నటీనటుల బిహేవియర్ ఉండి ఉంటే అంతా బాగుండేది. అరవింద్ పాత్రకి శ్రీ కి అసలు సూట్ కాలేదు. అతని ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంత బాగోలేదు. చివరిలో శ్రీ తన నటన ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది.
ఈ సినిమా ప్లాట్ లో చాలా లొసుగులున్నాయి. కొన్ని సన్నివేశాలలో అసలు లాజిక్ లేదు. ఒక చెడ్డ కుర్రాడు క్రూరమైన సైకో కిల్లర్ గా మారడానికి గల ఎమోషనల్ సీన్ అంత ఎఫెక్టివ్ హగా లేదు. క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా ఘోరంగా ఉంది, సినిమా క్లైమాక్స్ లో నటీనటుల నటనకి ప్రేక్షకులకి బాగా చిరాకు వస్తుంది. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలోథ్రిల్లింగ్ కన్నా ఎక్కువ భాగం బోరింగ్ గా ఉంటుంది.
సాంకేతిక విభాగం :
కె. రాజేంద్ర బాబు సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమా ఎడిటింగ్ బాగోలేదు, అలాగే సినిమా అంత మంచి ఫీల్ ని కలుగ జేయదు. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని మరిచిపోవలసిందే. కొన్ని ముఖ్యమైన సీన్స్ లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శేఖర్ సూరి ఈ సినిమా దర్శకత్వం విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాకి 100 మార్కులు వేస్తే అరవింద్ 2 సినిమాకి 50 మార్కులు కూడా వెయ్యలేము.
తీర్పు :
అరవింద్-2 ఆకట్టుకొని థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కోసం చాలా కష్ట పడడం జరిగింది కానీ అదంతా వృధా అయిపోయింది. కారణం కథ బాగోలేదు, దర్శకత్వం అంతగా లేదు, ఎడిటింగ్ బాగా చేయలేదు. ముందు జరగబోయే సన్నివేశాలు ఊహించేలా వుండడం ఈ సినిమాకి మైనస్. ‘ ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాలా ఉంటుందని భావించి సినిమాకి వెళితే ప్రేక్షకునికి నిరాశ తప్పదు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
అనువాదం : నగేష్ మేకల