లేటెస్ట్ : ఇండియాలోని నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు విచారకరమైన వార్త

లేటెస్ట్ : ఇండియాలోని నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు విచారకరమైన వార్త

Published on Jul 21, 2023 12:00 AM IST


ఎంతో ప్రజాదరణ కలిగిన ఓటిటి ప్లాట్ ఫ్యామ్స్ లో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. వారి ప్లాట్ ఫ్యామ్ లో సిరీస్, సినిమాల యొక్క నాణ్యత మరియు విస్తృత శ్రేణి కంటెంట్‌ ఎంతో బాగుంటుందనేది తెల్సిందే. అయితే ఇండియాలోని ఇతర ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే దీని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు చాలా ఖరీదైనవి. విషయం ఏమిటంటే, ఈ రోజు నెట్‌ఫ్లిక్స్ ఇండియా చాలామంది వినియోగదారులను నిరాశపరిచే ఒక న్యూస్ ని ప్రకటించింది. తమ స్ట్రీమింగ్ సర్వీస్ వినియోగదారులు ఇకపై తమ పాస్‌వర్డ్‌లను వారి ఇంటి వెలుపల ఎవరితోనూ పంచుకోకుండా నియంత్రించనున్నట్లు ఒక అధికారిక ప్రకటన ద్వారా తెలిపారు.

నెట్‌ఫ్లిక్స్ ఖాతా అనేది ఒక కుటుంబానికి చెందినది, ఆ ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరూ నెట్‌ఫ్లిక్స్‌ను వారు ఎక్కడ ఉన్నా, అంటే ఇంట్లో, ప్రయాణంలో, సెలవుల్లో ట్రాన్స్ఫర్ ప్రొఫైల్ వంటి కొత్త ఫీచర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు వారు తెలిపారు. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈ కొత్త విధానం గురించి భారతదేశంలోని వినియోగదారులకు ఇమెయిల్ పంపడం ప్రారంభించింది. కాబట్టి, ఇకపై భారతీయ యూజర్లెవరూ తమ నెట్‌ఫ్లిక్స్ ఖాతాను స్నేహితులతో పంచుకోవడం సాధ్యం కాదు. ఈ అప్‌డేట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు