గత ఏడాది ఇదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ పోకిరి నుంచి ఇపుడు బిజినెస్ మేన్ దగ్గరకి వచ్చింది. మరి మహేష్ ఫ్యాన్స్ స్టార్ట్ చేసిన ఈ హవాలో అయితే పలు తమిళ సూపర్ హిట్ చిత్రాలు కూడా మన తెలుగులో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ అయ్యాయి. మరి ఈ చిత్రాల్లో రీసెంట్ గా తమిళ క్లాసిక్ చిత్రం “సూర్య సన్నాఫ్ కృష్ణన్” వచ్చి మంచి హిట్ అయ్యింది.
అప్పుడు కన్నా ఇప్పుడే మరింత వసూళ్లు కూడా వచ్చాయని అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం తర్వాత మరో తమిళ డబ్ చిత్రం రీ రిలీజ్ కి రాబోతుంది. మరి ఆ చిత్రమే హీరో ధనుష్ నటించిన యూత్ ఫుల్ హిట్ చిత్రం “రఘువరన్ బీటెక్”. మరి అప్పట్లో తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రంని చాలా మంది థియేటర్స్ లో మిస్ అయ్యారు. మరి వారికి అయితే ఇప్పుడు మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఈ ఆగస్ట్ 18న తెలుగులో రీ రిలీజ్ కాబోతుంది. మరి దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.