సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మ, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా మూవీ గదర్ 2. అనిల్ శర్మ గ్రాండ్ గా తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ ని సొంతం చేసుకుంది. మిథూన్ సంగీతం అందించిన ఈ మూవీని జీ స్టూడియోస్ వారితో కలిసి అనిల్ శర్మ ప్రొడక్షన్స్, ఎమ్ ఎమ్ మూవీస్ తో కలిసి అనిల్ శర్మ స్వయంగా భారీ వ్యయంతో నిర్మించారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇప్పటికే గదర్ 2 మూవీ రూ. 510 కోట్ల నెట్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. మరొక రూ. 15 కోట్లు రాబడితే ఈ మూవీ పఠాన్ కలెక్షన్ ని దాటేసి ఆల్ టైం రికార్డు అందుకుంటుంది.
అయితే నేడు జవాన్ మూవీ రిలీజ్ కావడంతో గదర్ 2 పఠాన్ రికార్డుని అందుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. ఇక మరొక విషయం ఏమిటంటే, పఠాన్ రికార్డుని గదర్ 2 బద్దలుకొట్టినప్పటికీ కూడా అది ఎక్కువ రోజులు నిలిచే అవకాశం కనపడడం లేదని, నేడు రిలీజ్ అయిన జవాన్ అందరి నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో అతి త్వరలోనే గదర్ 2 ని జవాన్ క్రాస్ చేస్తుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.