బుక్ మై షో లో ‘స్కంద’ సూపర్ రికార్డు

బుక్ మై షో లో ‘స్కంద’ సూపర్ రికార్డు

Published on Sep 12, 2023 7:00 PM IST

యువ నటుడు రామ్ పోతినేని హీరోగా మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ స్కంద. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై దీనిని శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మించారు. థమన్ అందించిన సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచింది స్కంద.

ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ కి ముందే ప్రముఖ టిక్కెటింగ్ మాధ్యమం బుక్ మై షోలో 100 కె ఇంట్రెస్ట్ లను సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. అల్లు అర్జున్ పుష్ప 2 తో పాటు ప్రభాస్ సలార్ సినిమాలు మాత్రమే ఈ రేర్ ఫీట్ ని అందుకున్నాయి. వాటి అనంతరం బుక్ మై షో లో ఈ సూపర్ రికార్డు ని స్కంద దక్కించుకుంది. సెప్టెంబర్ 28న స్కంద పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు