‘SIIMA – 2023’ అవార్డ్స్ కి సర్వం సిద్ధం

‘SIIMA – 2023’ అవార్డ్స్ కి సర్వం సిద్ధం

Published on Sep 14, 2023 8:37 PM IST

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA ) ప్రతి ఏడాది అట్టహాసంగా జరుగుతుందనేది మనకు అందరికీ తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా మన సౌత్ సినీ పరిశ్రమకు చెందిన పలు సినిమాలు పలు క్యాటగిరిల్లో అవార్డులకు నామినేట్ అయ్యాయి. అయితే వీటిలో ఎవరెవరికి ఏ ఏ అవార్డులు దక్కాయి అనేది మరొక రెండు రోజుల్లో తెలియనుంది. కాగా ఈ అవార్డుల వేడుకని రేపు మరియు ఎల్లుండి దుబాయ్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

కాగా SIIMA – 2023 అవార్డుల వేడుక కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి, లక్ష్మి మంచు, శ్రీలీల, ప్రణీత సుభాష్, జేవీ ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్ ఈ ఏడాది మరింత గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ అన్నివిధాలుగా సన్నాహాలు చేసారని, తప్పకుండా ఇది అద్భుతంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు గెస్టులు తెలిపారు. కాగా వారి ప్రెస్ మీట్ తాలూకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు