బిగ్ బాస్ సీజన్-7 నుంచి మూడో వారం గాయని దామిని భట్ల ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తానూ తన ‘ఎలిమినేషన్ ను అస్సలు ఊహించలేదు అని, హౌస్‌లోకి వచ్చి మూడు వారాలే కావడంతో, ఇంట్లో వాళ్లను వదిలేసి వచ్చానన్న ఫీలింగ్ కూడా తనకు లేదు అని, ఇంకా తాను హౌస్ లో ముందుకు వెళ్తానని అనిపించింది అని దామిని తన ఎలిమినేషన్ లో భాగంగా చెప్పుకొచ్చింది. ఇక హౌస్ నుంచి దామిని బయటకు వచ్చిన సందర్భంగా హౌస్‌మేట్స్ లోని ప్రతి ఒక్కరికీ ఒక సలహా ఇవ్వమని నాగార్జున చెప్పారు.
ఈ క్రమంలో దామిని రతిక గురించి మాట్లాడుతూ.. ‘నువ్వు వాదన చేస్తున్నప్పుడు సగం సగం వినకు, అలాగే ముఖ్యమైన పాయింట్లకే జవాబు ఇవ్వు. అని సలహా ఇచ్చింది. అలాగే తేజ గురించి మాట్లాడుతూ.. ‘ఎవరి మనసు నొప్పించనని తేజ కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. ఈ షోలో అది వర్కవుట్ అవదు. చెప్పాలనుకున్నది ముఖంపైనే చెప్పు’ అని సలహా ఇచ్చింది. ఇక ప్రిన్స్ యావర్ గురించి చెబుతూ.. ‘ఏం చెప్పినా ముందు అర్థం చేసుకో. తొందరపడొద్దు. తెలుగు అర్థం చేసుకో. తెలియకపోతే హౌస్‌మేట్స్‌ను అడుగు’ అని సలహా ఇచ్చింది. ప్రస్తుతం దామిని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.