నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో గతంలో ప్రసారం అయిన అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ షో కి మంచి రేటింగ్స్ తో పాటు భారీ వ్యూస్ కూడా లభించాయి. ఆ విధంగా టాప్ లో ట్రెండ్ అయిన అన్ స్టాపబుల్ యొక్క లేటెస్ట్ సీజన్ ప్రస్తుతం రెడీ అవుతోందని, అతి త్వరలో మిమ్మల్ని అలరించేందుకు వస్తుందని, లిమిటెడ్ ఎడిషన్ అంటూ ఆహా వారు తాజాగా రిలీజ్ చేసిన ఈ క్రేజీ షో యొక్క ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.
కాగా ఈ సీజన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది వీడియోలో మేకర్స్ అనౌన్స్ చేయనప్పటికీ, అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఇది రానున్న దసరా పండుగ నుండి ప్రారంభం కానుందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ఫేమస్ సెలెబ్రిటీలు తాజా సీజన్ లో సందడి చేయనున్నారట. ఇక ఈ లేటెస్ట్ సీజన్ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.
Yessss! You guessed it right. The BAAP OF ALL TALK SHOWS returns to entertain you all…????
Unstoppable with NBK, Limited Edition Coming Soon????#UnstoppableWithNBK #NBKOnAHA #NandamuriBalakrishna #NBK@Manepally18 @sprite_india #MansionHouse @southindiamalls@MYDrPainRelief pic.twitter.com/208oVFRaUJ— ahavideoin (@ahavideoIN) October 7, 2023