యూఎస్ లో సెన్సేషనల్ మైల్ స్టోన్ కి దగ్గరలో “లియో”

యూఎస్ లో సెన్సేషనల్ మైల్ స్టోన్ కి దగ్గరలో “లియో”

Published on Oct 13, 2023 9:00 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం “లియో”. మరి తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి భాగమైన సినిమాగా ఇది వస్తుండగా ఫ్యాన్స్ లో అయితే ఓ రేంజ్ లో ఈ చిత్రానికి నెలకొంది. ఈ హైప్ తోనే ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సెన్సేషనల్ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ లో అయితే కొడుతోంది.

అలా యూఎస్ విషయానికి వస్తే ఈ చిత్రానికి అక్కడ ఇపుడు ఆల్రెడీ 9 లక్షల డాలర్స్ గ్రాస్ నమోదు అయ్యిందట. దీనితో జస్ట్ ప్రీమియర్స్ తోనే సెన్సేషనల్ మైల్ స్టోన్ 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం అందుకోడానికి సిద్ధంగా ఉందని చెప్పాలి. అంతే కాకుండా ఒక్క తెలుగు వెర్షన్ లోనే లక్ష డాలర్స్ కి పైగా గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో లియో పై ఉన్న హైప్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు