సమీక్ష : “రాక్షస కావ్యం” – మెప్పించే ఫస్టాఫ్ నొప్పించే సెకండాఫ్

సమీక్ష : “రాక్షస కావ్యం” – మెప్పించే ఫస్టాఫ్ నొప్పించే సెకండాఫ్

Published on Oct 14, 2023 3:03 AM IST
Raakshasa Kaavyam Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 13, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అభయ్ నవీన్ బేతినేని, అన్వేష్ మైఖేల్, దయానంద్ రెడ్డి, పవాన్ రమేష్, రోహిణి ఆరెట్టి కుశాలిని

దర్శకుడు : శ్రీమాన్ కీర్తి

నిర్మాతలు: దాము రెడ్డి, సింగనమల కళ్యాణ్

సంగీతం: రాజీవ్ రాజ్, శ్రీకాంత్ ఎమ్

సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం

ఎడిటర్: వెంకట్ కళ్యాణ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు అభయ్ భేతిగంటి హీరోగా మరో యువనటుడు అన్వేష్ మైకేల్ కలయికలో దర్శకుడు శ్రీమాన్ కీర్తి తెరకెక్కించిన ఓ చిత్రం కూడా వచ్చింది అదే “రాక్షస కావ్యం”. ట్రైలర్ తో మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..ఈ చిత్రం 2004 ఆ సమయంలో సెటప్ చేయబడింది. అజయ్(అభయ్ భేతిగంటి) ఓ కాంట్రాక్టు కిల్లర్ పైపెచ్చు తనకి చదువుకునే వారు అంటే ఎంతో గౌరవం అలాగే ఇంకో పక్క విజయ్(అన్వేష్ మైకేల్) తాను సినిమాల్లో విలన్స్ ని న్యాయం చెయ్యాలని తనదో సెపరేట్ ట్రాక్ లో వెళ్తూ ఉంటాడు. అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? వీరిద్దరికీ ఏదన్నా బ్యాక్ స్టోరీ ఉందా? ఉంటే దానికి కారణాలు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మేజర్ గా ఇంప్రెస్ చేసే భాగం ఏదన్నా ఉంది అంటే అసలు ఈ సినిమా ఫస్టాఫ్ అని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ లోనే ఇతిహాసం పరంగా సాలిడ్ స్టార్ట్ తో దర్శకుడు మంచి ఆసక్తి రేకెత్తించాడు. ఇద్దరు మెయిన్ లీడ్ పాత్రల్ని పురాణాల నుంచి ప్రేరణగా తీసుకొని ప్రస్తుత కాలంలో వారు ఉంటే ఎలా ఉంటుందని అనే పాయింట్ బాగుంది. అలాగే ఫస్టాఫ్ లో వచ్చే ప్రతి కామెడీ సీన్ అలాగే ఎమోషన్స్ చాలా బాగున్నాయి.

ఇంకా నటుడు అభయ్ అయితే తన కెరీర్ లో సాలిడ్ రెస్పాన్స్ ని అందించాడు అని చెప్పాలి. చాలా నాచురల్ గా రా అండ్ రస్టిక్ గా ఇది ఉంటుంది. అంతే కాకుండా తన బ్యాక్ స్టోరీ కానీ అందులో ఎమోషన్స్ కానీ ఆడియెన్స్ కి నచ్చుతాయి. వీటితో పాటుగా తనతో నటించిన అన్వేష్ కూడా మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచాడు.

వీరితో పాటుగా నటుడు దయానంద్ రెడ్డి కూడా మంచి పాత్రను ఎంచుకొని దానిని పర్ఫెక్ట్ గా పండించాడు. నటుడు పవన్ రమేష్ పై ట్రాక్ కూడా బాగుంది. మరో మేజర్ పాయింట్ ఏమిటంటే ఫస్టాఫ్ లో నడిచే రా అండ్ రస్టిక్ కథనం ఈ తరహా చిత్రాలు ఇష్టపడే వారికి నచ్చుతుంది. సినిమాలో ముగింపు పర్వాలేదు అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఒక సాలిడ్ ఫస్టాఫ్ చూసిన తర్వాత సెకండాఫ్ కూడా అదే రేంజ్ లో ఉంటే అది చిన్న సినిమా అవ్వనీ పెద్ద సినిమా అవ్వనీ దాని ఫలితం ఇంకో లెవెల్లో ఉంటుంది. అయితే ఈ చిత్రానికి మాత్రం మంచి ఫస్టాఫ్ చూసిన తర్వాత సెకండాఫ్ మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది. దర్శకుడు తన రెండో పాత్రకి న్యాయం చేసే ప్రయత్నం చేసాడు కానీ అది ఏమాత్రం మెప్పించేలా లేదు.

ఒక కోణం వరకు ఇది కరెక్టే కానీ ఫస్టాఫ్ తో పోలిస్తే అది బాగున్నంత లెవెల్లో అయితే సెకండాఫ్ ఖచ్చితంగా లేదు. చాలా సిల్లీగా బోరింగ్ గా సినిమా సాగుతుంది. అంతే కాకుండా చాలా వరకు కొన్ని సీన్స్ ఆల్రెడీ చూసిన వాటి లానే ఊహించదగిన రేంజ్ లోనే ఉంటాయి.

అలాగే హీరో పాత్ర అయితే కొన్ని చోట్ల మంచి క్లారిటీగా కనిపించినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం బాగా వీక్ గా అనిపిస్తుంది ఇందులోనే చూపించే వైలెన్స్ లాంటివి కొన్ని వర్గాల ప్రేక్షకులని డిస్టబ్ చేయవచ్చు. వీటితో అయితే చాలా మంది అజయ్ వెర్షన్ కి కనెక్ట్ అయినా విజయ్ వెర్షన్ కి మాత్రం కనెక్ట్ కావడం కొంచెం కష్టం అని చెప్పాలి.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బావున్నాయి. అలాగే టెక్నీకల్ టీం ఎఫర్ట్స్ అయితే సాలిడ్ లెవెల్లో ఇచ్చారు. సంగీతం మరియు సినిమాటోగ్రఫీలు అయితే మంచి క్వాలిటీలో సినిమా టోన్ కి తగ్గట్టుగా చాలా బావున్నాయి. అలాగే ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. డైలాగ్స్, ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.

ఇక దర్శకుడు శ్రీమాన్ కీర్తి విషయానికి వస్తే.. తాను ఫస్టాఫ్ ని అయితే ఓ రేంజ్ లో తెరకెక్కించాడు అందులో ఎలాంటి సందేహం లేదు పైగా తాను మన పురాణాల నుంచి ప్రేరణగా తీసుకున్న పాయింట్ గాని దానిని ప్రెజెంట్ చేయడంలో కానీ కొంతమేర సక్సెస్ అయ్యాడు. కానీ సెకండాఫ్ లో మాత్రం చాలా డిజప్పాయింటింగ్ వర్క్ ని అందించాడు. రెండో పాత్రని మొదటి పాత్ర తరహాలో మంచి ఎంగేజింగ్ గా చూపించి ఉంటే డెఫినెట్ గా ఈ చిత్రం అందరి ఆడియెన్స్ లో వర్కౌట్ అయ్యేది. ఒక్క ఈ అంశం మినహా తన వర్క్ అండ్ ఎఫర్ట్స్ ఈ సినిమాకి బాగున్నాయి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రాక్షస కావ్యం” లో ఇంట్రెస్టింగ్ స్టార్టింగ్ అండ్ ఫస్టాఫ్ లు ఎంతగానో ఇంప్రెస్ చేస్తాయి. అలాగే నటుడు అభయ్ బేతిగంటి అన్ని ఎమోషన్స్ ని కూడా బాగా చేశాడు. కామెడీ, ఎమోషన్స్ తో సాగిన మంచి ఫస్టాఫ్ తర్వాత అసలు ఏమాత్రం ఆకట్టుకోని ఒక బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ సెకండాఫ్ అయితే టోటల్ సినిమా రిజల్ట్ ని మార్చేసింది. వీటితో అయితే ఒక మంచి ఫస్టాఫ్ చూసి సెకండాఫ్ వద్దు అనుకుంటే తప్ప ఈ చిత్రం మెప్పించదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు