సమీక్ష : తంతిరం – ఏమాత్రం ఆకట్టుకోదు

సమీక్ష : తంతిరం – ఏమాత్రం ఆకట్టుకోదు

Published on Oct 14, 2023 3:05 AM IST
Tantiram Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 13, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ఎలందూరు తదితరులు.

దర్శకుడు : ముత్యాల మెహర్ దీపక్

నిర్మాత: శ్రీకాంత్ కాండ్రాగుల

సంగీతం: అజయ్ అరసాడ

సినిమాటోగ్రఫీ: ఎస్. వంశీ శ్రీనివాస్

ఎడిటర్: ఎస్. వంశీ శ్రీనివాస్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

తంతిరం టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1 అనే థ్రిల్లర్యాక్షన్ మూవీ తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ముత్యాల మెహర్ దీపక్ తెరకెక్కించారు. నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

మద్యపానం తాగుతూ తన స్నేహితులకి ఒక కథని చెప్తాడు విజయ్. క్రాకర్స్ తయారు చేసే బాలచంద్రన్ (శ్రీకాంత్ గుర్రం) అనే వ్యక్తి యొక్క కథని వారికి వినిపిస్తాడు. తన తల్లి ఇంటినుండి పారిపోవడంతో బాలచంద్రన్ కి ఆడవారి పట్ల చిన్నప్పటి నుండి అయిష్టత ఏర్పడుతుంది. అయితే తన తండ్రి యొక్క బలవంతం మేరకు అలగిని (ప్రియాంక శర్మ) అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు బాలచంద్రన్. కానీ ఆమె పట్ల ఎప్పుడూ అయిష్టత చూపుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒక అద్భుత శక్తి (జెనీ) అతడిని అతడి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. మరి అది ఎలా జరిగింది ఆ పైన ఏమైంది అనేది మొత్తం సినిమాలో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

మైథలాజికల్ స్టోరీ అయిన అహల్య రాయిగా మారిన కథతో ఈ మూవీ ఇంట్రెస్టింగ్ నోట్ లో ప్రారంభం అవుతుంది. అయితే అసలు జెనీలు ఎవరు అనేది మనకు మంచి పరిచయం అందించడంతో పాటు కథ పై ఆసక్తిని ఏర్పరుస్తాడు దర్శకుడు. మొత్తం ఈ మూవీలో బాలచంద్రన్, అలగని రెండు మాత్రమే ప్రధాన పాత్రలు. ఇద్దరి పాత్రలు ఆకట్టుకుంటాయి, మరియు చిన్న పాత్రలో కనిపించిన అవినాష్ ఎలందూర్ అలరిస్తారు. అటు ప్రియాంక, ఇటు శ్రీకాంత్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

 

మైనస్ పాయింట్స్ :

అయితే సెకండ్ చాప్టర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన మేకర్స్, ఫస్ట్ చాప్టర్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. జెనీ కి సంబంధించిన మిస్టరీ అంశాన్ని ఫస్ట్ చాప్టర్ లో రివీల్ చేయలేదు. అది ఆడియన్స్ ని ఒకింత డిజప్పాయింట్ చేస్తుంది. నిజానికి చాప్టర్ 1 లో గల షార్ట్ స్టోరీ ని దాదాపుగా 100 నిమిషాలకు పైగా చెప్పాల్సిన అవసరం లేదనే అనాలి. ఆ విధంగా ఆడియన్స్ యొక్క సహనానికి టెస్ట్ పెట్టారు మేకర్స్. నిజానికి ఈ కథ యొక్క గమనాన్ని బట్టి దీనిని ఒకే మూవీగా చెప్పొచ్చు. మరి దీనిని రెండు చాప్టర్స్ గా తీయాలని మేకర్స్ కి ఎందుకు అనిపించిందో తెలియదు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఏమాత్రం ఆకట్టుకోదు సరికదా ఆడియన్స్ ని మరింత నీరసానికి గురి చేస్తుంది.

 

సాంకేతిక వర్గం :

అజయ్ అరాసాడ సాంగ్స్ పర్వాలేదు, మరియు బీజీఎమ్ అయితే బాగానే ఉంది. ఎస్ వంశీ శ్రీనివాస్ అందించిన సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ ఎడిటింగ్ ఏమాత్రం బాగోలేదు. రెండు గంటలకు తక్కువగానే నిడివి ఉన్నప్పటికీ సాగతీత సినిమా చూసిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిజానికి దర్శకుడు ముత్యాల మెహర్ దీపక్ ఇటువంటి ఫాంటసీ కథని తీయాలని భావించే ఆలోచన బాగుంది. అయితే ఈ కథని రెండు చాప్టర్స్ గా తీయాలనుకోవడం, అందుకోసం ఫస్ట్ చాప్టర్ ని బాగా సాగదీయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

 

తీర్పు :

మొత్తంగా తంతిరం అనే ఈ ఫాంటసీ డ్రామా యాక్షన్ మూవీ ఆరంభములో ఆకట్టుకున్నప్పటికీ రాను రాను ఆడియన్స్ యొక్క సహనానికి పరీక్ష పెడుతుంది. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. స్టోరీ ని రెండు చాప్టర్స్ గా విభజించి, ఫస్ట్ చాప్టర్ లో షార్ట్ స్టోరీ తీసుకుని దానిని సాగదీయడం నిజంగా ఇబ్బందికరం. స్లో స్క్రీన్ ప్లే ఆడియన్స్ యొక్క సహనానికి పరీక్ష పెడుతుంది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు