టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం డిసెంబర్ 8, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నాయి. మేకర్స్ నిన్న టీజర్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా టీజర్ ను చూసిన ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ చూడటానికి చాలా ఎంటర్ టైనింగ్ గా, ఫన్ గా ఉంది అని అన్నారు. హీరో నితిన్ కి, హీరోయిన్ శ్రీ లలకి మరియు చిత్ర యూనిట్ కి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలి అని బెస్ట్ విషెస్ తెలిపారు. వక్కంతం వంశీ రచన, దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు.
The teaser of #ExtraOrdinaryMan is looking highly entertaining and fun. Wishing @actor_nithiin garu, @sreeleela14 & the entire team a massive blockbuster! ✨???? https://t.co/NwBiYvOUyP@vamsivakkantham @Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy @SreshthMovies @adityamusic
— Naga Vamsi (@vamsi84) October 31, 2023