‘గుంటూరు కారం’ : ఇంట్రెస్టింగ్ గా సాంగ్స్ లైనప్

‘గుంటూరు కారం’ : ఇంట్రెస్టింగ్ గా సాంగ్స్ లైనప్

Published on Nov 13, 2023 11:34 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ క్రేజీ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా యువ అందాల నటీమణులు శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకముగా సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఇక ఇటీవల గుంటూరు కారం నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా అందరి నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఈ మూవీలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆ సాంగ్స్ లైనప్ ప్రకారం అనంతరం రెండవ సాంగ్ గా మెలోడీ సాంగ్ రిలీజ్ కానుండగా ఆపైన ఒక ఐటెమ్ సాంగ్, చివరిగా ప్రీ క్లైమాక్స్ మాస్ సాంగ్ రిలీజ్ అవుతాయట. మొత్తంగా ఈ నాలుగు సాంగ్స్ తో పాటు బీజీఎమ్ కూడా థమన్ అదరగొట్టనున్నట్లు టాక్. కాగా ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు