ఇండియాలో షారుఖ్ ఖాన్ ‘డన్కి’ టికెట్ బుకింగ్స్ ఓపెన్

ఇండియాలో షారుఖ్ ఖాన్ ‘డన్కి’ టికెట్ బుకింగ్స్ ఓపెన్

Published on Dec 16, 2023 11:41 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా తాప్సి పన్ను హీరోయిన్ గా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ మూవీ డన్కి. రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియోస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న మూవీ యొక్క ఇండియా టికెట్ బుకింగ్స్ కొద్దిసేపటి క్రితం ఓపెన్ అయ్యాయి. మరోవైపు పలు ప్రాంతాల్లో బుకింగ్స్ పరంగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బుకింగ్స్ ని డిసెంబర్ 7 నుండి ఆరంబించగా అక్కడి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రీతం సంగీతం అందించిన ఈ మూవీతో తమ హీరో మరొక సూపర్ హిట్ కొట్టి ఈ ఏడాది కెరీర్ పరంగా హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకుంటారని షారుఖ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు