యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన తన మొదటి ఓటిటి సిరీస్ తో ఇప్పుడు హిట్ కొట్టి మంచి జోష్ లో ఉండగా దీని తర్వాత తాను చేస్తున్న సినిమానే “తండేల్”. తన కెరీర్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో చైతు ఒక కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించనుండగా మేకర్స్ లేటెస్ట్ గా ఓ సాలిడ్ అప్డేట్ ని అయితే అందించారు. దీనితో ఈ చిత్రం షూటింగ్ ని అయితే లేటెస్ట్ గా సముద్రం మధ్యలో ఓ కొత్త షెడ్యూల్ లో స్టార్ట్ చేస్తున్నట్టుగా చైతు పై ఓ ఎనర్జిటిక్ స్టిల్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు.
అలాగే రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ అందిస్తామని చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈ క్రేజీ అప్డేట్ తో ఈ ఉదయమే అక్కినేని ఫ్యాన్స్ కి మేకర్స్ మంచి కిక్ ఇచ్చారు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే గీతా ఆర్ట్స్ 2 వారు మాసివ్ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.
Team #Thandel begins an adrenaline pumping schedule in middle of the oceans ????
Shoot in progress ????
Exciting updates soon ????#Dhullakotteyala i????
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli pic.twitter.com/v1LimLU4XI— Thandel (@ThandelTheMovie) December 26, 2023