షూట్ కంప్లీట్ చేసుకున్న కమల్ హాసన్ ‘భారతీయుడు – 2’

షూట్ కంప్లీట్ చేసుకున్న కమల్ హాసన్ ‘భారతీయుడు – 2’

Published on Jan 2, 2024 1:27 AM IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ భారతీయుడు 2. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, సిద్దార్థ్, ప్రియభావాని శంకర్, సముద్రఖని, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని ఆ అంచనాలు మరింత పెంచేసాయి. విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా టీమ్ మొత్తం కలిసి దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ స్టార్ క్యాస్టింగ్ తో పాటు హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న భారతీయుడు 2 మూవీ ఆగష్టు లో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు