మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. మరి గత ఏడాది రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఊహించని ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని అప్పుడే తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తారు అని టాక్ వచ్చింది కానీ తర్వాత కేవలం హిందీ రిలీజ్ మాత్రమే చేస్తామని కన్ఫర్మ్ చేశారు.
కానీ అది అప్పుడు థియేట్రికల్ గా కాలేదు కానీ అక్కడ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ వారు అయితే ఇప్పుడు ఆచార్య హిందీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. తాజాగా సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి హిందీ వెర్షన్ లో ఈ జనవరి 11న తమ యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో మొత్తానికి ఈ సినిమా ఈ రకంగా విడుదల కాబోతోంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా పూజా హెగ్డే చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.
#Acharya trailer is here! Get ready for an entertainment extravaganza!#MegastarChiranjeevi #RamCharan #PenMovies pic.twitter.com/lzrhAsBaoI
— Pen Movies (@PenMovies) January 8, 2024