టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్. ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భం గా డైరెక్టర్ అనిల్ రావిపూడి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సంక్రాంతి విజయవంతం గా ఉంటుంది అని, హీరో వెంకటేష్ గారికి, శైలేష్ కొలను కి మరియు చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలి అని అన్నారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, ఆర్య, ముఖేష్ రిషి, జిషు సేన్‌గుప్తా, జయ ప్రకాష్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి సైంధవ్‌ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు.