“నా సామిరంగ” లో చిరు రిఫరెన్స్!

“నా సామిరంగ” లో చిరు రిఫరెన్స్!

Published on Jan 14, 2024 11:00 PM IST


టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ. ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్ ఇందులో ఉంది. ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించిన అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు మెగాస్టార్ చిరంజీవి మంచి దొంగ చిత్రం కి వెళ్తారు. ఇది మెగా ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రం లో అషికా రంగనాథ్, మిర్ణ మీనన్, రుక్సర్ దిల్లాన్ లు కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు