కొత్త సినిమాని అనౌన్స్ చేసిన “మ్యాడ్” మేకర్స్

కొత్త సినిమాని అనౌన్స్ చేసిన “మ్యాడ్” మేకర్స్

Published on Jan 28, 2024 7:49 PM IST

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ MADతో అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత, ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా ద్వారా ఈ బ్యానర్ తన కొత్త ప్రాజెక్ట్ కి సంబందించిన అనౌన్స్ మెంట్ ను చేయడం జరిగింది. రేపు ఉదయం 09:36 గంటలకు సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ను వెల్లడించనున్నట్లు తెలిపారు.

మ్యూజికల్ అండ్ యూత్ ఫుల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రీ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమా ఈ ప్రాజెక్ట్‌కి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు