లీక్ ల పై ‘పుష్ప 2’ టీమ్ అసంతృప్తి

లీక్ ల పై ‘పుష్ప 2’ టీమ్ అసంతృప్తి

Published on Jan 30, 2024 10:00 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, పుష్ప 2: ది రూల్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబధించిన స్టిల్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి. దాంతో, ఇలాంటి లీకుల జరగకుండా పుష్ప నిర్మాణ బృందం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. అయినా, కొన్ని ఆన్-సెట్ స్టిల్స్ ఆన్‌ లైన్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు, నిన్న కూడా పుష్ప 2 నుండి అల్లు అర్జున్ స్టిల్స్ మళ్లీ లీక్ అయ్యాయి. అసలు ఇటువంటి లీకుల సంఘటనలను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఇంకా స్టిల్స్ లీక్ అవుతూ ఉండటం పై పుష్ప చిత్ర బృందం అసంతృప్తిగా ఉంది.

ఇక ఈ పుష్ప 2 సినిమాని సుకుమార్ వెరీ ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేస్తున్నాడట. పైగా ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక వచ్చే షెడ్యూల్ లో గుంతకల్లు నల్లమల అడవుల ప్రాంతంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న, 2024లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు