బాక్సాఫీస్ వద్ద “ఫైటర్” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

బాక్సాఫీస్ వద్ద “ఫైటర్” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on Jan 30, 2024 5:25 PM IST


భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డే ట్రీట్‌గా విడుదలైన బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొనేల హై బడ్జెట్ యాక్షన్ డ్రామా ఫైటర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవుతోంది. రొటీన్ కంటెంట్ కారణంగా సినిమాకి అంత వసూళ్లు రావడం లేదు. సోమవారం రోజున ఫైటర్ మూవీ వసూళ్లు దారుణం గా పడిపోయాయి. భారతదేశం అంతటా టిక్కెట్ కౌంటర్లలో కేవలం 8 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ సినిమా మొత్తం 5 రోజుల ఆల్ ఇండియా నెట్ వసూళ్లు దాదాపు 127 కోట్ల రూపాయలు.

మరోవైపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 220 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం ఉత్తర అమెరికా ప్రాంతంలో ఇప్పటివరకు 5.2 మిలియన్ల డాలర్ల కి పైగా వసూలు చేసింది. ఫైటర్ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అతని మునుపటి చిత్రం, షారుఖ్ ఖాన్ మరియు దీపికా పదుకొనే నటించిన స్పై థ్రిల్లర్ పఠాన్, భారతదేశం అంతటా 525 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఫైటర్ లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు