రాజమౌళి సినిమా కోసం మహేష్ కొత్త లుక్

రాజమౌళి సినిమా కోసం మహేష్ కొత్త లుక్

Published on Feb 5, 2024 7:00 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైనింగ్ కోసం జర్మనీ వెళ్లారు. నిన్న రాత్రే మహేష్ హైదరాబాద్ తిరిగొచ్చారు. ఐతే, మహేష్ శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి కారణం మహేష్ సరికొత్త లుక్ లో కనిపించడమే. దీంతో కొత్త లుక్‌లో మహేష్ ‘సూపర్’ ఉన్నారంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే, మహేష్ ఈ కొత్త లుక్ ను తన సినిమా కోసమే అని తెలుస్తోంది. స్టార్ దర్శకుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ సినిమా రాబోతుంది.

మహేష్ కొత్త లుక్ ఈ సినిమా కోసమే అని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తోంది అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు