మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ స్టైలిష్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈగిల్. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల నటించారు. ఇటీవల తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం మంచి టాక్ తో కలెక్షన్ తో కొనసాగుతోంది.
తాజాగా ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ అయిన సహదేవ్ పై ప్రముఖ ఫిలిం అనలిస్ట్ గిరీష్ జోహార్ ప్రసంశలు కురిపించారు. కొద్దిసేపటి క్రితం సహదేవ్ మూవీ చూసాను, రవితేజ గారు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు తనకు ఎంతో బాగా నచ్చాయని అన్నారు. అలానే సర్ప్రైజింగ్ ట్విస్ట్ లతో పాటు మిగతా పాత్రధారుల యాక్టింగ్, సౌండ్, విజువల్స్ ఇలా ప్రతి ఒక్క అంశం బాగుందని, మొత్తంగా ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని తన ట్విట్టర్ ప్రొఫైల్ ద్వారా తెలిపారు గిరీష్ జోహార్. కాగా ఆయన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Saw #Sahadev (#Eagle) …solid action, ???????????????? surprising plot twists, its an edge of the seat thriller.????????????
Superlative BGM & sound design, stylised action & fast paced narrative by Director @karthikghattam3 ????????????????????
The impressive 2nd half with unique action sequences makes… pic.twitter.com/PeXuhbGagZ
— Girish Johar (@girishjohar) February 13, 2024