విశ్వక్ సేన్ “గామి” అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్!

విశ్వక్ సేన్ “గామి” అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్!

Published on Mar 3, 2024 2:32 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరియు చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం గామి. నూతన దర్శకుడు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన ట్రైలర్ సినిమా పై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయడం జరిగింది.

లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడాడ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఈ చిత్రం థియేటర్ల లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు