నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో, అంజి కంచిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టైటిల్ ను మేకర్స్ నేడు అనౌన్స్ చేశారు. పక్కా గోదావరి యాస్ ఉట్టిపడే విధంగా టైటిల్ ను ఆయ్ ను అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చాలా ఫన్నీ గా ఉంది. సినిమా కూడా ఏ తరహా లో ఉండబోతుంది అనేది ఈ వీడియో చూస్తే చెప్పొచ్చు.
ప్రొడ్యూసర్ బన్నీ వాసు డైరెక్టర్ కు ఫోన్ చేసి టైటిల్ ను అడగడం, తర్వాత అదే ఫోన్ కాల్ లో హీరో, హీరోయిన్ లు కూడా జాయిన్ అవ్వడంతో అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మార్చ్ 7 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. GA2 పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి