“చిత్రం” సీక్వెల్ పై లేటెస్ట్ బజ్.!

“చిత్రం” సీక్వెల్ పై లేటెస్ట్ బజ్.!

Published on Mar 7, 2024 1:23 AM IST

టాలీవుడ్ సినిమా దగ్గర తమ చిత్రాలతో చెరగని ముద్ర వేసిన యంగ్ హీరోస్ లో ఉదయ్ కిరణ్ కూడా ఒకడు. మరి ఉదయ్ కిరణ్ తో ఎన్నో సెన్సేషనల్ హిట్స్ చేసిన దర్శకుడు తేజ కాంబినేషన్ కోసం కూడా చాలా మందికి తెలుసు. అయితే వీరి నుంచి వచ్చిన యూత్ ఫుల్ హిట్స్ చిత్రాల్లో తమ డెబ్యూ ప్రాజెక్ట్ “చిత్రం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం మళ్ళీ ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి గత 2021 లోనే అనౌన్స్ చేశారు.

అయితే ఇప్పుడు దీనిపై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా ఓ కొత్త యువ హీరోతో అయితే దీనికి సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరు ఇతర డీటెయిల్స్ ముందు ముందు తెలియనున్నాయి. మొత్తానికి అయితే ఈ వింటేజ్ సెన్సేషన్ కి సీక్వెల్ అంటే ఆసక్తిగానే ఉంది మరి తేజ మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి కూడా ఆర్ పి పట్నాయక్ నే సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు