విడుదల తేదీ : మార్చి 08, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ తదితరులు.
దర్శకుడు: గిరీష్ ఎ.డి
నిర్మాత: ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్
సంగీత దర్శకులు: విష్ణు విజయ్
సినిమాటోగ్రాఫర్: అజ్మల్ సాంబు
ఎడిటింగ్: ఆకాష్ జోసెఫ్, వర్గీస్
సంబంధిత లింక్స్: ట్రైలర్
నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన మళయాళ చిత్రం ప్రేమలు. ఈ రోజు ఈ చిత్రం తెలుగులో విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
సచిన్ (నస్లెన్ కె. గఫూర్) ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఐతే, ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత యూ.కే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ కోచింగ్ అంటూ హైదరాబాద్ వస్తాడు. మరోవైపు రీనూ (మమితా బైజు) హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తుంటుంది. అసలు సచిన్ – రీనూ ఎలా కలిశారు ?, రీనూ కోరుకున్న అంశాలు ఏవీ సచిన్ లో లేకపోయినా అతన్ని ఆమె ఎందుకు ప్రాణంగా ప్రేమిస్తోంది ?, ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, వీరి ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది ?, ఇంతకీ, సచిన్ తన ప్రేమను గెలుచుకున్నాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఫీల్ గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే, ఎమోషనల్ గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. హీరోగా నస్లెన్ కె. గఫూర్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే ‘నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు’ ల రెండు పాత్రల మధ్య వ్యత్యాసాలు, ఈ రెండు పాత్రలతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ప్రేమలు చిత్రం ఆకట్టుకుంది.
నస్లెన్ కె. గఫూర్ తన అమాయకమైన పేస్ తో మరియు తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సచిన్ అనే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్ గా నటించిన మమితా బైజు తన లుక్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ నటన కూడా చాలా బాగుంది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ లు కూడా చాలా బాగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
దర్శకుడు గిరీష్ ఎ.డి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్ లవ్ స్టోరీని కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్ టైన్ గా చెప్పాడు. తెలుగు అనువాదం డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది.
మైనస్ పాయింట్స్
దర్శకుడు గిరీష్ ఎ.డి రెండు విరుద్ధ పాత్రలకు సంబంధించిన మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, అలాగే ఆ లైన్ ను ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకున్నప్పటికీ.. కొన్నిచోట్ల ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ను సింపుల్ గా డిజైన్ చేయడం బాగాలేదు. అలాగే, హీరోహీరోయిన్ల మధ్య సాగే సీన్స్ కూడా బాగా స్లోగా సాగాయి.
అలాగే వారి ప్రేమ కథకు ఇంకా బలమైన సంఘర్షణ ఉండి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ గా ఉండేది. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య పెట్టిన ఒకటి రెండు ల్యాగ్ సీన్స్ కూడా లేకుండా ఉండి ఉంటే బాగుండేది. ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు విష్ణు విజయ్ అందించిన పాటలు బాగున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు గిరీష్ ఎ.డి ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకున్నారు. ఇక సినిమాలోని నిర్మాతలు ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
గుడ్ ఫన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ ‘ప్రేమలు’ సినిమాలో కామెడీ సీన్స్, ఎమోషనల్ గా సాగే కొన్ని లవ్ సీన్స్ మరియు నటీనటుల నటన చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఐతే, సినిమాలో కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని చాలా అంశాలు కనెక్ట్ అవుతాయి. అలాగే, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team