పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) టైటిల్ రోల్ లో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి (OG). ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సుజీత్. జపనీస్ భాషను వాడి, అందరిలో క్యూరియాసిటి ను రేకెత్తించారు. ఆ తరువాత అందరినీ మరింత ఆకట్టుకున్న విషయం హంగ్రి చీతా, మరాఠీ డైలాగ్. పవన్ కళ్యాణ్ ను చిరుత తో పోలుస్తూ, గంభీరా రోల్ ను చాలా ఎలివేట్ చేశారు.
నేడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అవే ఓమి భౌ (Omi Bhau) మరియు లైటర్ పై జపాన్ బాషలో ఉన్న ఫీర్స్ హైనా. భౌ అనేది మరాఠీ పదం, భాయ్ లేదా బ్రదర్ అని అర్దం. ఇమ్రాన్ ను భయంకరమైన హైనా అంటూ పోస్టర్ లో పేర్కొన్నారు. ఇప్పుడు హంగ్రి చీతా కి, ఫీర్స్ హైనా కి సిసలైన వార్ ను పేర్కొనే విధంగా ఇమ్రాన్ డైలాగ్ ఉంది. గంభీరా, నువ్వు తిరిగి బాంబే వస్తున్నానని విన్నా, ప్రామిస్, ఇద్దరిలో ఒక తలే మిగులుతుంది అని.
ఈ ఇంట్రెస్టింగ్ డీటైల్స్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రియాంక మోహన్ (Priyanka mohan) లేడీ లీడ్ రోల్ లో నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.