శంకర్ బ్రాండ్ ని డామినేట్ చేసిన చరణ్ చరిష్మా?

శంకర్ బ్రాండ్ ని డామినేట్ చేసిన చరణ్ చరిష్మా?

Published on Apr 19, 2024 10:04 AM IST

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “గేమ్ చేంజర్” (Game Changer) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడో మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది. అయితే అప్పట్లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వేరు కానీ సమయం ఎక్కువ అవుతున్న కొద్దీ అప్పుడు ఉన్న రేంజ్ అంచనాలు ఈ సినిమాకి కొంచెం తక్కువ అయ్యాయి.

అయినా కూడా చరణ్ పాన్ ఇండియా లెవెల్లో తన ఛరిష్మాతో మంచి బజ్ ని తీసుకొస్తున్నాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దీనికి ముందు శంకర్ కి సరైన హిట్ లేదు పైగా సీక్వెల్స్ చేస్తున్నారని ఓ మార్క్ కూడా ఉంది. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో మాత్రం రామ్ చరణ్ శంకర్ క్రేజ్ ని డామినేట్ చేసాడని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇప్పుడు శంకర్ కమల్ హాసన్ తో “ఇండియన్ 2” (Indian 2) కూడా చేస్తున్నాడు. కానీ గేమ్ చేంజర్ కి దానికి పోలిస్తే నార్త్ లో గేమ్ చేంజర్ కే ఎక్కువ బిజినెస్ జరిగినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ లెక్కన చరణ్ క్రేజ్ వల్లే ఇది సాధ్యం అయ్యిందని చెప్పవచ్చు. మరి రిలీజ్ అయ్యాక ఏ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు