టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల విడుదలైన ది ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి స్పై థ్రిల్లర్ (VD 12) కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది మరియు ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఏప్రిల్ 28, 2024న ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం వైజాగ్‌కు వెళ్లనుంది. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫోర్చర్ ఫోర్ సినిమాస్ లు సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. కథానాయిక పాత్ర కోసం భాగ్యశ్రీ బోర్సే మరియు మమితా బైజు పరిశీలనలో ఉన్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.