ఇటీవల పాన్ ఇండియన్ మూవీ హను మాన్ తో పెద్ద విజయం సొంతం చేసుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని త్వరలో అనౌన్స్ చేయనుందని ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక వారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని రేపు ఉదయం 12. 30 నిమిషాలకు అనౌన్స్ చేయనున్నట్టు నేడు కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసారు.
నిరంజన్ రెడ్డి గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈమూవీ ద్వారా తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. లవ్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ లాంచ్ ఈవెంట్ ని రేపు ఉదయం 11 గం. ల నుండి హైదరాబాద్ దస్పల్లా కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజక్ట్ లో ఎవరెవరు నటించనున్నారు అనేది రేపు వెల్లడి కానుంది.