సూపర్ స్టార్ మహేష్ తో త్వరలో దిగ్గజ దర్శకడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 మూవీ అనౌన్స్ మెంట్ కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న సంగతి తెలిసిందే.
అయితే ఈమూవీ కి సంబంధించి ప్రస్తుతం ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా ప్రముఖ నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తనకు SSMB 29 మూవీ స్టోరీ తెలుసునని, ఇటీవల టీమ్ తో కలిసి చర్చల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అయితే మూవీ పక్కాగా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, షూటింగ్ కి ఎన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి పూర్తి విషయాలు కేవలం రాజమౌళి గారికి మాత్రమే తెలుసని అన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజక్ట్ కి సంబంధించి ప్రతి విషయంలో ఆయన ఎంతో కేర్ తీసుకుంటున్నారని అన్నారు. అంతే కాక పక్కాగా మూవీ గురించి అన్ని విషయాలు టీమ్ వెల్లడించేవరకు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ తప్పకుండా అందరి అంచనాలకు మించే ఉంటుందని తెలిపారు.