స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చివరిచిత్రం వీరసింహరెడ్డి చిత్రం గతేడాది థియేటర్ల లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ డైరెక్టర్ తదుపరి ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, సోషల్ మీడియాలో తాజాగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేడియం లో మొదటి సారి క్రేజీ ఫీలింగ్ ను ఎక్స్ పీరియన్స్ చేస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ను లైవ్ లో వీక్షించారు. అందుకు కారణం అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి థాంక్స్ తెలిపారు గోపిచంద్ మలినేని. వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మ్యూజికల్ గా ఆడియెన్స్ ను , ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నాయి.
First Ever Experience in the Stadium ????️
It’s crazy What A feeling to be here Witnessing #SRHvCSKThanks to Bawss @MusicThaman for making it real ❤️❤️❤️???????? pic.twitter.com/YQAk2mOTjN
— Gopichandh Malineni (@megopichand) April 28, 2024