శరవేగంగా విజయ్ “ది గోట్” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్!

శరవేగంగా విజయ్ “ది గోట్” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్!

Published on May 14, 2024 7:56 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు వెంకటేష్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT). ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ షురూ అయినట్లు ప్రొడ్యూసర్ అర్చన కల్పతి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ఈ చిత్రం కి సంబందించిన అప్డేట్స్ ఇక త్వరలో ఒక దాని తర్వాత మరొకటి వెల్లడి కానున్నాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ మరియు అరవింద్ ఆకాష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు