యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మే 19, 2024 న ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ కి సంబందించిన ప్రోమో ను రిలీజ్ చేశారు.
ప్రోమో చాలా పవర్ ఫుల్ గా సాగింది. పూర్తి సాంగ్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిరుద్ రవి చందర్ ఈ సాంగ్ ను వేరే లెవెల్లో కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.