దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. తాజాగా మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్. మరి, విజయ్ సేతుపతి నిజంగా మహేష్ సినిమాలో నటిస్తాడో ? లేదో ? చూడాలి.
కాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. అన్నట్టు ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం.
అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసే ప్రయత్నం చేశాను. కానీ రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.