ప్రభాస్ చివరిసారిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. నైజాం ప్రాంతంలో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీ అయిన కల్కి చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ భారీ బడ్జెట్ మూవీ ఓపెనింగ్స్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో, కల్కి చిత్రానికి ప్లస్ అయ్యింది అని చెప్పాలి. టికెట్ హైక్స్, మిస్ నైట్ షోస్, స్పెషల్ షో లతో ఓపెనింగ్స్ ను భారీగా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ కూటమి కి ముందునుండే పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. అయితే గత ప్రభుత్వం పెద్ద చిత్రాల విషయం లో టికెట్ రేట్స్ మరియు స్పెషల్ షో లకు ఎక్కువగా అనుమతి ఇవ్వలేదని చెప్పాలి. రాబోయే పెద్ద చిత్రాలలో కల్కి ముందుగా రిలీజ్ కానుంది.
ఈ చిత్రంలో దీపికా పదుకునే , దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.