విడుదల తేదీ : జూన్ 07, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: నవదీప్, పంకూరి గిద్వానీ, చార్వి దత్తా తదితరులు
దర్శకుడు: అవనీంద్ర
నిర్మాతలు : సి స్పేస్
సంగీత దర్శకుడు: గోవింద్ వసంత్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి
పాటలు: అనంత్‌శ్రీరామ్
బ్యానర్: నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్
సినిమాటోగ్రఫీ: అజయ్ శివశంకర్
ఎడిటింగ్: అవనీంద్ర
సంబంధిత లింక్స్: ట్రైలర్
అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్, పంకూరి గిద్వానీ, చార్వి దత్తా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ :
మౌళి (నవదీప్) చిన్న తనం నుంచి ఒంటరిగా పెరుగుతాడు. మనుషులతో సమాజంతో కలవడానికి కూడా ఇష్టపడడు. ఐతే, తాను మంచి ఆర్టిస్ట్. తను వేసే పెయింటింగ్స్ లో ఎంతో డెప్త్ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మౌళి వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (పంకూరి గిద్వానీ) అతని జీవితంలోకి వస్తోంది. ఆమెను మౌళి ఘాడంగా ప్రేమిస్తాడు. ఐతే, కొన్నాళ్ల తర్వాత ‘చిత్ర’లో మౌళి కోరుకున్న మార్పులు ఏమిటి ?, అసలు చిత్ర ఎలా ఉండాలని మౌళి ఆశించాడు ?, అందుకోసం మౌళి ఏం చేశాడు ?, ఇంతకీ ప్రేమ అంటే ఏమిటో మౌళి తెలుసుకున్నాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో హీరోగా నటించిన నవదీప్ ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో, అలాగే హీరోయిన్ తో సాగే బోల్డ్ అండ్ లవ్ సీన్స్ లో నవదీప్ నటన చాలా బాగుంది. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా నవదీప్ ఎమోషనల్ గా బాగా పండించాడు. కొన్నిచోట్ల అతని టైమింగ్ కూడా మంచి ఫన్ ను జనరేట్ చేసింది. ఇక హీరోయిన్ గా నటించిన పంకూరి గిద్వానీ నటన సినిమాకి ప్లస్ అయింది.
పంకూరి గిద్వానీ తన నటనతోనూ అలాగే తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా మూడు డిఫెరెంట్ షేడ్స్ ఉన్న గెటప్స్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. మిర్చి కిరణ్ తో పాటు మిర్చి హేమంత్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు అవనీంద్ర రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమా టేకింగ్ లో ఉన్న కొత్తదనం సినిమాలో కూడా అంతే బలంగా ఉండి ఉంటే బాగుండేది. నిజానికి యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు బాగానే ఉన్నా.. కొన్ని చోట్ల మాత్రం దర్శకుడు అవనీంద్ర ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయించి, అనవసరమైన రొమాన్స్ ను ఇరికించాడు. మనుషులతో కలవలేని ఒంటరి హీరో పాత్రకి, భిన్నమైన హీరోయిన్ పాత్రలకు మధ్య సీన్స్ ను ఇంకా చాలా బాగా రాసుకోవచ్చు. కానీ, ఉన్న సీన్స్ కూడా చాలా రెగ్యులర్ గా సాగాయి.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ప్లే చాలా స్లోగా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు బోల్డ్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసినా.. అవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే, నటీనటుల నటన బాగున్నా, వాళ్ళ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు మాత్రం సినిమాని బలహీనపరిచింది. మొత్తానికి ‘లవ్ మౌళి’ ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల నిరాశ పరిచింది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు అవనీంద్ర దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. కాకపోతే తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ అందించిన సంగీతం పర్వాలేదు. ఇక ఎడిటర్ గా కూడా బాధ్యతలు చేపట్టిన అవనీంద్ర అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
తీర్పు:
‘లవ్ మౌళి’ అంటూ వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ ఫాంటసీ డ్రామాలో హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అండ్ లవ్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఎమోషనల్ గా సాగిన ఫీల్ గుడ్ క్లైమాక్స్ ఆకట్టుకుంది. కానీ, స్క్రీన్ ప్లే పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాకపోయినా.. లవర్స్ కు మాత్రం కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team