సమీక్ష : “సత్యభామ” – కాజల్ ఫ్యాన్స్ కి మాత్రమే

సమీక్ష : “సత్యభామ” – కాజల్ ఫ్యాన్స్ కి మాత్రమే

Published on Jun 8, 2024 3:03 AM IST
Satyabhama Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 07, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: కాజల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, నేహా పఠాన్, అంకిత్ కొయ్య, అనిరుద్ పవిత్రన్ తదితరులు

దర్శకుడు: సుమన్ చిక్కాల

నిర్మాతలు: శశికిరణ్ తిక్క, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి

సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి

ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని నోటెడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రలో నటించిన కాప్ డ్రామా “సత్యభామ” కూడా ఒకటి. కాజల్ చాలా నమ్మకంగా ఉండి సాలిడ్ ప్రమోషన్స్ చేసిన ఈ చిత్రం ఆమె అంచనాలు అందుకొని అందరినీ మెప్పించిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. వృత్తి పరంగా ఒక అగ్రెసివ్, నిజాయితీ గల పోలీస్ ఆఫిసర్ అయినటువంటి సత్యభామ (కాజల్ అగర్వాల్) తన భర్త అమరేందర్ (నవీన్ చంద్ర) తో ఒక హ్యాపీ జీవనాన్ని సాగిస్తుంది. అలా ఆమె పని చేస్తున్న షీ టీం ఆడవారు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరిస్తారు. అలా ఓ రోజు హసీనా (నేహా పఠాన్) అనే ఒక అమ్మాయి తన భర్త యదు(అనిరుద్ పవిత్రన్) తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అని పోలీసులని ఆశ్రయిస్తుంది. ఈ క్రమంలో యదు ఆమెని చంపేస్తాడు. ఆమె చనిపోయే ముందు తన తమ్ముడు చోటుగా పిలవబడే ఇక్బాల్(అంకిత్ కొయ్య) ని జాగ్రత్తగా చూస్కోమని మాట తీసుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఇక్బాల్ ఒక ఉగ్రవాది అని ముద్ర పడుతుంది. మరి అతడు నిజంగానే ఉగ్రవాదా? అక్క అంటే అమితమైన ప్రేమ ఉన్న ఇక్బాల్ అసలు ఏం చేస్తాడు? సత్యభామ అతని విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? ఈ క్రమంలో ఆమెకి ఎదురైన సవాళ్లు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత కాజల్ ఫ్యాన్స్ కి అయితే ఆమె నుంచి మంచి ట్రీట్ లభిస్తుంది అని చెప్పాలి. ఈ సినిమా కోసం కాజల్ పెట్టిన ఎఫర్ట్స్ ని మెచ్చుకొని తీరాలి. ఇప్పుడు వరకు మనం చూసిన కాజల్ వేరు సత్యభామలో కాజల్ వేరు అని చెప్పాలి. ఒక అగ్రెసివ్ పోలీస్ గా ఆమె తన రోల్ అదరగొట్టేసింది అని చెప్పాలి.

మెయిన్ గా ఆమె పెర్ఫామెన్స్ తో పాటుగా ఆమెపై కొన్ని మాస్ మూమెంట్స్ అయితే ఒక స్టార్ హీరోని ఎలా చూపిస్తారో ఆ రేంజ్ లో సాలిడ్ గా ఉన్నాయి. ఆమె ఇంట్రో సీన్ కానీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో కానీ కాజల్ అదరగొట్టింది. అలాగే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆమె విషయంలో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే సినిమాలో ఆమెతో పాటుగా చాలా పాత్రలు కనిపిస్తాయి.

మెయిన్ గా యంగ్ నటీనటులు అంకిత్, అనిరుద్ లు సాలిడ్ పెర్ఫామెన్స్ ను కనబరిచారు. అలాగే నేహా పఠాన్ మంచి ఎమోషన్స్ ని కనబరిచింది అలాగే వీరితో పాటుగా సంపద తదితర యువ నటులు సహజమైన పెర్ఫామెన్స్ ని కనబరిచారు. ఇక వీరితో పాటుగా ప్రముఖ నటులు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్ లు తమ పాత్రలు పరిధి మేరకు బాగా చేశారు. ఇక సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ఓకే అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో నిరుత్సాహ పరిచే అంశాలు చాలానే ఉంటాయి అని చెప్పాలి. మరీ అంత గొప్పగా లేకపోయినా ఓ మాదిరిగా ఓకే అనిపించేలా ఉండే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ మరింత నీరుగారుస్తుంది. మెయిన్ గా ఒకదాని తర్వాత ఒక కొత్త పాత్ర పరిచయం అవుతూ కథనం ఒకింత కన్ఫ్యూజ్ గా మారిపోయినట్టుగా విసుగు తెప్పించేలా అనిపిస్తుంది.

అలాగే ఒక టైం లో అసలు సినిమా కాజల్ దా లేక వేరే వ్యక్తిదా అన్నట్టు అనిపిస్తుంది. ఓవర్ డీటైలింగ్ ఫస్టాఫ్ లో సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. ఇంకా కథనంలో మెయిన్ పాయింట్ సహా ఇతర సమస్యలు ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. దీనితో అసలు కథనం ఎటెటో వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే సినిమాలో కథనం చాలా చోట్ల మనం ఇది వరకే పలు సినిమాల్లో చూసేసినట్టే అనిపిస్తుంది.

ఇంకా ఎవరైతే అమాయకంగా ప్రొజెక్ట్ చేయబడతారో వారే మెయిన్ విలన్ అన్నట్టుగా కనిపించే టెంప్లెట్ ఎన్నో సినిమాల్లో చూసేసాం. సో వీటితో ఈ సినిమా ఏమంత గొప్పగా అనిపించదు. అయితే కాజల్ రోల్ ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తూ మరిన్ని మాస్ సీన్స్ దట్టించాల్సింది. ఇంకా ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర లాంటి పాత్రలకి సినిమాలో పెద్దగా స్కోప్ లేదు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ సినిమాకి కావాల్సినంత ఖర్చు పెట్టారు. ఇక సాంకేతిక టీంలో శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇంకా కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పర్వాలేదు కానీ చాలా కొన్ని అనవసర సీన్స్ తగ్గించాల్సింది. కొన్ని చోట్ల వేగవంతంగా అనిపిస్తుంది కానీ అది రుచించదు. డైలాగ్స్ పర్వాలేదు.

ఇక దర్శకుడు ఇక దర్శకుడు సుమన్ చిక్కాల విషయానికి వస్తే దర్శకునిగా తన వర్క్ నటీనటుల విషయంలో బాగుంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ని శశికిరణ్ తిక్క అందించాడు. తన వర్క్ మాత్రం ఈ సినిమాలో మెప్పించే విధంగా సాగలేదు అని చెప్పాలి. చాలా రొటీన్ లైన్ సినిమాలో ఉంది కానీ దానిని ఎంగేజింగ్ గా మలచడంలో వీరు విఫలం అయ్యారు. ఒక్క కాజల్ క్యారక్టరైజేషన్ బాగుంది తప్పితే మిగతా సినిమా కన్ఫ్యూజ్ గా బోర్ కొట్టించేలా కొనసాగుతుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “సత్యభామ” మాత్రం కాజల్ వన్ విమెన్ షో అని చెప్పాలి. సినిమాలో ఆకట్టుకునే కథ కథనాలు లేకపోయినా ఆమె మాత్రం తన నటన యాక్షన్ పెర్ఫామెన్స్ లతో అదరగొడుతుంది. ఆమె ఫ్యాన్స్ కి మాత్రం తన నుంచి ఎలాంటి డిజప్పాయింట్మెంట్ అనిపించదు. అలాగే ఆమె రోల్ ని ఇంకా హైలైట్ గా చూపించినా బాగుణ్ణు అనిపిస్తుంది. కానీ సినిమాలో కథా కథనాల్లో లోపం ఉన్నాయి. బోరింగ్ అండ్ కన్ఫ్యూజ్ గా సాగే కథనాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. వీటితో అయితే ఒక్క కాజల్ అభిమానులకి సినిమా ఓకే అనిపిస్తుంది కానీ ఇతర ఆడియెన్స్ అయితే చాలా తక్కువ అంచనాలు పెట్టుకుని సినిమా ఈ సినిమా ట్రై చేస్తే బెటర్.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు