సమీక్ష: ‘ర‌క్ష‌ణ’ – రొటీన్ గా సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్

సమీక్ష: ‘ర‌క్ష‌ణ’ – రొటీన్ గా సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్

Published on Jun 8, 2024 3:01 AM IST
Rakshana Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 07, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: పాయల్ రాజ్ పుత్, మానస్, రోష‌న్, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు

దర్శకుడు: ప్ర‌ణదీప్ ఠాకోర్

నిర్మాతలు : య‌శోద ఠాకోర్

సంగీత దర్శకుడు: స్వ‌ర సాగ‌ర్ మ‌హ‌తి

సినిమాటోగ్రఫీ: అనిల్ బండారి

ఎడిటింగ్: గ్యారీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

న‌టి పాయ‌ల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో న‌టించిన తాజా చిత్రం ‘ర‌క్ష‌ణ‌’. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాను ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ డైరెక్ట్ చేశారు. నేడు థియేట‌ర్ల‌లోకి వచ్చిన ‘ర‌క్షణ’ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

 

కథ:

ఏసిపి కిర‌ణ్(పాయ‌ల్ రాజ్ పుత్) సిన్సియ‌ర్ లేడీ పోలీస్ ఆఫీస‌ర్. న‌గ‌రంలో జ‌రుగుతున్న వ‌రుస హ‌త్య‌ల వెన‌కాల ఉన్న‌ది ఎవ‌ర‌నే విష‌యాన్ని తెలుసుకునేందుకు ఆమె రంగంలోకి దిగుతుంది. అయితే ఓ సైకో కిల్ల‌ర్ ఈ హ‌త్య‌లకు కార‌ణ‌మని ఆమె తెలుసుకుంటుంది. ఇంత‌లో ఓ కేసు కార‌ణంగా స‌స్పెండ్ అయిన కిర‌ణ్ ఈ హ‌త్య‌ల‌ను ఆపుతుందా..? అస‌లు ఈ హ‌త్య‌ల వెనుక కార‌ణం ఏమిటి..? సైకో కిల్ల‌ర్ ను ఆమె ప‌ట్టుకుంటుందా..? అనేది మిగ‌తా క‌థ‌.

 

ప్లస్ పాయింట్స్:

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌కు కావాల్సిన పాయింట్ ఈ సినిమాకు బ‌లం అని చెప్పాలి. ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో పాయ‌ల్ రాజ్పుత్ బాగా న‌టించింది. ఆమె వ‌రుస హ‌త్య‌ల‌కు గ‌ల కార‌ణాల‌ను ఇన్వెస్టిగేట్ చేసే తీరు బాగుంది. ఓ కేసు కార‌ణంగా ఆమె స‌స్పెండ్ అయినా, ఆమె సొంతంగా కేసును ఛేదించే విధానాన్ని బాగా చూపించారు. క్రైమ్ సీన్స్ ను ఆమె అనలైజ్ చేసి, హంతకుడి మెంటాలిటీని డీకోడ్ చేసే విధానం బాగుంది.

యాక్ష‌న్ సీన్స్ కూడా బాగా కుదిరాయి. మాన‌స్ న‌ట‌న బాగుంది. అత‌డి పాత్రను చ‌క్క‌గా డిజైన్ చేశారు. విల‌న్ ఎవ‌ర‌నేది స‌స్పెన్స్ గా పెట్ట‌డంతో ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆస‌క్తి క్రియేట్ అవుతుంది. అత‌డిని ప‌ట్టుకునేందుకు పాయ‌ల్ ఏం చేస్తుందా అనే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో ఏర్ప‌డుతుంది.

న‌టుడు రోష‌న్ కూడా బాగా న‌టించాడు. అత‌డి ప‌ర్ఫార్మెన్స్, లుక్స్ బాగున్నాయి. హీరోయిన్, విల‌న్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి.

 

మైనస్ పాయింట్స్:

థ్రిల్ల‌ర్ సినిమాల్లో ఉండాల్సిన ఉత్కంఠ ఈ సినిమాలో త‌క్కువ‌నే చెప్పాలి. నెక్ట్స్ సీన్ లో ఏం జ‌రుగుతుందా అనే ఆస‌క్తి ఆడియెన్స్ లో క్రియేట్ చేయ‌డంలో చిత్ర యూనిట్ త‌డ‌బ‌డింది. ఫ‌స్టాఫ్ లో స్క్రీన్ ప్లే వ‌ర్క‌వుట్ కాలేదు. సినిమా చాలా స్లోగా సాగుతుంది. వ‌రుస హ‌త్య‌లు జ‌రుగుతున్న త‌రుణంలోనే ఇంట‌ర్వెల్ వ‌చ్చేస్తుంది.

సెకండాఫ్ లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. సినిమాలోని చాలా సీన్స్ సాగ‌దీసిన‌ట్లుగా అనిపిస్తాయి. పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోతాయి. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా, వారి పాత్ర‌లు పెద్ద‌గా ఎలివేట్ కాలేక‌పోతాయి.

సినిమాలో వావ్ ఫ్యాక్టర్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. క‌థ బాగా రాసుకున్నా, దాన్ని ప్రెజెంట్ చేసిన‌ తీరు ఇంకాస్త బెట‌ర్ గా ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం:

ద‌ర్శ‌కుడు ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ రాసుకున్న క‌థ రొటీన్ అయినప్ప‌టికీ, ఆయ‌న ఎంచుకున్న పాయింట్ బాగుంది. క్రైమ్, స‌స్పెన్స్ కు కావాల్సిన అంశాలను ఆయన బాగా హ్యాండిల్ చేశారు. స్క్రీన్ ప్లే ఇంకాస్త బెట‌ర్ గా ఉండాల్సింది. కొన్ని ల్యాగ్ సీన్స్ సినిమాను బోరింగ్ గా మారుస్తాయి. స్వ‌ర సాగ‌ర మ‌హ‌తి బీజీఎం ఆకట్టుకునే విధంగా ఉంది. ఎడిటింగ్ వ‌ర్క్ ఇంకాస్త బెట‌ర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

 

తీర్పు:

ఓవ‌రాల్ గా ర‌క్ష‌ణ మూవీ కొన్ని స‌న్నివేశాల్లో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటుంది. పాయ‌ల్ రాజ్పుత్ ప‌ర్ఫార్మ‌న్స్, స్క్రిప్టు ఈ సినిమాకు బ‌లంగా నిలిచినా.. సినిమా ఎగ్జిక్యూష‌న్, డ‌ల్ మూమెంట్స్ వంటి అంశాల వ‌ల్ల సినిమా అంద‌రికీ న‌చ్చ‌క‌పోవ‌చ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు