సమీక్ష: “మహారాజ” – ఎమోషన్స్ తో ఆకట్టుకొనే రివెంజ్ డ్రామా

సమీక్ష: “మహారాజ” – ఎమోషన్స్ తో ఆకట్టుకొనే రివెంజ్ డ్రామా

Published on Jun 15, 2024 3:06 AM IST
Maharaja Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 14, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామ్, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి, సచన నమిదాస్

దర్శకుడు: నితిలన్ సామినాథన్

నిర్మాతలు : సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి

సంగీత దర్శకుడు: అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్

ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

తమిళ వెర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తన కెరీర్ లో 50వ సినిమాగా చేసిన లేటెస్ట్ చిత్రమే “మహారాజ”. మరి తమిళ్ సహా తెలుగులో కూడా రిలీజ్ అయ్యిన ఈ చిత్రాన్ని సేతుపతి తెలుగులో కూడా సాధ్యమైనంత ప్రమోషన్స్ ని చేసాడు. మరి తన కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా అయిన దీనితో తాను హిట్ అందుకున్నాడో లేదో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. మహారాజ(విజయ్ సేతుపతి) ఓ చిన్నపాటి మధ్యతరగతి కుటుంబీకుడు. తన సెలూన్ లో క్షవరం చేస్తూ తన కూతురు జ్యోతితో ఒక ఆనందకర జీవితాన్ని కొనసాగిస్తాడు. అయితే తన గతంలో జరిగిన ప్రమాదం మూలాన తన భార్య చనిపోతుంది. కానీ తన ఇంట్లో ఉన్న ఒక చెత్త డబ్బా మూలాన తన కూతరు కాపాడబడుతుంది. దీనితో అక్కడ నుంచి మహారాజ, జ్యోతి సెంటిమెంట్ గా ఆ చెత్త బుట్ట కి లక్ష్మి అని పేరు పెట్టుకొని తమ కుటుంబంలో ఒకటిగా దాన్ని పూజిస్తారు. ఇంకో పక్క సెల్వ(అనురాగ్ కాశ్యప్) తన గ్యాంగ్ తో సీరియల్ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలా ఓ రోజున తన లక్ష్మి పోయింది. అని మహారాజ పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్తాడు. ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? లక్ష్మి కోసం మహారాజ ఏం చేస్తాడు? ఈ క్రమంలో తన కూతురికి ఏమవుతుంది? సెల్వ కి మహారాజాకి ఏమన్నా సంబంధం ఉందా? లాంటి అనేక ఆసక్తికర ప్రశ్నలకి సమాధానం దొరకాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఏ నటుడికి అయినా తన కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం ఖచ్చితంగా నిలిచిపోయేలా ఉండాలి అని కోరుకుంటారు. మరి అది విజయ్ సేతుపతి గట్టిగానే కోరుకున్నట్టు ఉన్నాడని చెప్పాలి. తన కెరీర్ 50వ సినిమాగా సాలిడ్ సబ్జెక్టుని సేతు తన ఫ్యాన్స్ కి అందించాడు. ఒక ఇంటెన్స్ ఎమోషన్స్ సహా యాక్షన్ బ్లాక్ లతో ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ని సేతుపతి డెలివర్ చేసాడని చెప్పాలి.

విజయ్ సేతుపతి ఎంతటి వెర్సటైల్ నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమాలో కూడా తన వెర్సటాలిటీ తాను ప్రదర్శించాడు. ఇక ఈ చిత్రంలో డ్యూయల్ షేడ్స్ లో అదరగొట్టాడు. ఒక అమాయకమైన మధ్యస్థ వయసు గల తండ్రిగా సాలిడ్ పెర్ఫామెన్స్ అందించి అదరగొట్టాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ని సేతు ఓ రేంజ్ లో పండించాడు అని చెప్పాలి.

ఇక తనతో పాటుగా అనురాగ్ కశ్యప్ పాత్ర తక్కువ స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ, సాలిడ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. తనలో కూడా రెండు కోణాలు ఉండగా వాటిని అనురాగ్ అద్భుతంగా పండించారు. ఇంకా సినిమాలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కథనం చూసేందుకు మరింత ఆసక్తిగా మారుస్తుంది. సీన్ టు సీన్ డీసెంట్ కథనంతో సినిమా ఎంగేజింగ్ గా కొనసాగుతుంది.

ఇక ఒక ఇంట్రెస్టింగ్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కూడా అదే రీతిలో ఆసక్తిగా మంచి ఇంప్రెస్ చేసే ట్విస్ట్ లు సాలిడ్ ఎమోషన్స్ తో వీటికి అదనంగా విజయ్ సేతుపతి ఎందుకు పగ తీర్చుకోవాలి అని చూస్తున్నాడు అనే అంశాన్ని అర్ధవంతమైన స్క్రీన్ ప్లేతో ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో చూసే ఆడియెన్స్ కి మంచి థ్రిల్ అందించేలా కొనసాగుతుంది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో చాలా వరకు స్క్రీన్‌ప్లే బాగానే ఉన్నప్పటికీ, కీలక ట్విస్టులు మరియు టర్నింగ్ పాయింట్స్ తో ఉండే కథనం తెలిసిన మాత్రం ఒకింత కన్ఫ్యూజ్ చేయవచ్చు. ఒక టైం లో మనం చూస్తుంది ప్రస్తుత సన్నివేశాలా లేక గతానికి సంబంధించినవా అని సందేహం కలుగుతుంది.

అలాగే సినిమాలో కథనం చూస్తున్నంత సేపు సేతుపతి అంత గట్టిగా నిలబడుతున్నాడు అంటే తాను చెప్తున్నా కారణం కాక ఖచ్చితంగా ఇంకో కారణం ఉండే ఉంటుంది అనిపిస్తుంది. అలా అనుకున్నట్టుగానే కొన్ని సీన్స్ ఊహించదగినట్టే అనిపిస్తాయి. ఇంకా సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా కీలకం అయితే ఇది హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది కానీ ఈ ఒక్క పోర్షన్ మళయాళ సినిమా ‘ఇరట్టా’ ను గుర్తు చేస్తుంది.

ఇక ఈ చిత్రం ఎక్కువగా విజయ్ సేతుపతి పాత్రపై ఫోకస్ చేయబడి ఉంది. భారతీరాజా, మమతా మోహన్‌దాస్ మరియు అభిరామి వంటి ఇతర నటీనటులు ఉన్నప్పటికీ, వారి ప్రభావం అంతగా ఉండదు. వీరిలో కొందరు నటీనటులు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం కూడా లేదు. ఇంకా సినిమాలో ఎవరైనా కొంచెం మిస్ అయినా కూడా వారికి మొత్తం సినిమా కన్ఫ్యూజ్ గానే సాగొచ్చు.

సాంకేతిక విభాగం:

సినిమాలో నిర్మాణ విలువలు బావున్నాయి. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఫోలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాగుంది. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సన్నివేశాల్లో హైలైట్ గా నిలిచింది. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

ఇక దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ విషయానికి వస్తే.. తాను డీసెంట్ లైన్ ని ఈ సినిమాకి ఎంచుకున్నాడు. అంతే కాకుండా కథనం కూడా చాలా వరకు ఆకట్టుకునే విధంగా మలిచాడు. అయితే కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ గా స్లో గా అనిపిస్తుంది క్లైమాక్స్ కూడా ఇరట్టా ని గుర్తు చేస్తుంది. ఇవి మినహా దర్శకుడుగా ఈ సినిమాని తాను సాలిడ్ వర్క్ ని అందించాడు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే “మహారాజా” విజయ్ సేతుపతి కెరీర్ లో డెఫినెట్ గా నిలిచిపోయే పర్ఫెక్ట్ బెంచ్ మార్క్ సినిమా అని చెప్పవచ్చు. తన మార్క్ వెర్సటైల్ నటనతో సేతుపతి ఆశ్చర్యపరుస్తాడు. అలాగే ఆసక్తిగా సాగే కథనం, ట్విస్ట్ లు ఎమోషన్స్ తో ఈ రివెంజ్ డ్రామా ఆకట్టుకుంటుంది. దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు కానీ జస్ట్ కొన్ని చోట్ల కన్ఫ్యూజ్, స్లో కథనం పక్కన పెడితే విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో ఈ చిత్రం మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు