SDT18: తేజు కొత్త సినిమాపై అప్డేట్

SDT18: తేజు కొత్త సినిమాపై అప్డేట్

Published on Jun 21, 2024 11:31 AM IST

సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన ‘బ్రో’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. ఆ సినిమాలో ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా న‌టించ‌డంతో అభిమానులు ఆ సినిమాను చూసేందుకు ఆస‌క్తిని చూపారు. ఇక ఇప్పుడు తేజు త‌న కొత్త సినిమాను ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

ఇప్ప‌టికే ప‌లు క‌థ‌లు విన్న తేజు, ఎట్ట‌కేల‌కు ఓ క‌థ‌కు ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ‘హ‌ను-మాన్’ చిత్ర నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ నేడు సాయంత్రం 5.04 గంట‌ల‌కు రానున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

కాగా, ఈ సినిమాను ప్రైమ్ షో ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందించనున్నారు. అయితే, ఈ సినిమాను ఓ కొత్త డైరెక్ట‌ర్ తెరకెక్కించ‌బోతున్న‌ట్లుగా సినీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని మిగ‌తా క్యాస్టింగ్ గురించిన విష‌యంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు