కన్ఫూజ్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!

కన్ఫూజ్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!

Published on Jun 23, 2024 9:24 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ కల్కి 2898AD. ఈ చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బుకింగ్స్ ఓపెన్ కావడం తో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతూ, టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ప్రముఖ సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రం ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ తెలియకుండానే రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. బుక్ మై షో యాప్ లో చూసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలని కొందరు కోరుతున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రంలో దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు