‘అఖండ 2’ కోసం మార్పులు, చేర్పులు

‘అఖండ 2’ కోసం మార్పులు, చేర్పులు

Published on Jun 25, 2024 2:00 AM IST

‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సీక్వెల్ ను త్వరలో స్టార్ట్ చేస్తాం అని బోయపాటి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఏపీలో గవర్నమెంట్ మారడంతో.. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాల్సి వస్తోందట. ‘అఖండ 2’ చిత్రంలో గత ప్రభుత్వ తీరు పై కొన్ని సన్నివేశాలను రాసుకున్నారని, ఇప్పుడు ఆ సీన్స్ ను తీసేసి, వాటి ప్లేస్ లో కొత్త సీన్స్ రాస్తున్నారట.

ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే..హిందూ దేవాలయాలకు సంబదించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. ఈ సినిమా పై బాలయ్య అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు