మన టాలీవుడ్ సినిమానే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా ని కూడా మరో స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి. మరి తన చిత్రాలతో జక్కన్నగా పిలవబడే రాజమౌళి తెరకెక్కించిన గత చిత్రం “రౌద్రం రణం రుధిరం” (RRR Movie) తో ప్రపంచమే మన వైపు చూసేలా చేశారు.
మరి ఈ చిత్రంతో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుని కూడా గెలుపొందిన మొదటి భారతీయ సినిమాగా (పాటకి గాను) కూడా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ తర్వాత ఈ సినిమా హీరోలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) లు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆహ్వానం అందుకున్నారు.
ఇక ఇప్పుడు రాజమౌళి అలాగే తన సతీమణి రమా రాజమౌళి గార్లు కూడా ఆహ్వానం అందుకోవడం ప్రైడ్ మూమెంట్ గా నిలిచింది. మొత్తం 487 మంది కొత్త సభ్యుల జాబితాని మోషన్ పిక్చర్ అండ్ సైన్స్ కేటగిరీలో సిద్ధం చేయగా ఇందులో వీరిద్దరికి కూడా అకాడమీ వారు ఆహ్వానం పలికారు. దీనితో ఈ అంశం ఇపుడు మంచి ప్రైడ్ మూమెంట్ గా నిలిచింది.