ఓటిటి స‌మీక్ష: ఈటీవీ విన్ లో ‘శ‌శి మ‌థ‌నం’ వెబ్ సిరీస్

ఓటిటి స‌మీక్ష: ఈటీవీ విన్ లో ‘శ‌శి మ‌థ‌నం’ వెబ్ సిరీస్

Published on Jul 4, 2024 11:07 AM IST
Aham Reboot Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 04, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్, రూప‌ల‌క్ష్మి, ప్ర‌దీప్ రాప‌ర్తి, కృతిక‌, అశోక్ చంద్ర‌

దర్శకులు: వినోద్ గాలి

నిర్మాతలు : హ‌రీష్ కోహిర్క‌ర్

సంగీత దర్శకుడు: సింజిత్ యెర్ర‌మిల్లి

సినిమాటోగ్రఫీ: రెహాన్ షేక్

ఎడిట‌ర్ : అనిల్ కుమార్ పి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన శశి మ‌థ‌నం వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మ‌రి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

 

క‌థ:
వ‌రంగ‌ల్ కు చెందిన‌ మ‌ద‌న్(ప‌వ‌న్ సిద్ధు), హైద‌రాబాద్ కు చెందిన శ‌శి(సోనియా సింగ్) ఒకరినొక‌రు ఇష్ట‌ప‌డుతుంటారు. డ‌బ్బులను సులువుగా సంపాదించాల‌నుకునే మ‌ద‌న్ పేకాట‌, బెట్టింగ్ ల‌కు అలవాటు ప‌డతాడు. ఒక‌రోజు బెట్టింగ్ లో చాలా డ‌బ్బులు పోగొట్టుకున్న మ‌ద‌న్, అప్పుల‌వాళ్ల‌ను త‌ప్పించుకునేందుకు కొద్దిరోజులు శ‌శి వాళ్ల ఇంట్లో ఉండాల‌ని అనుకుంటాడు. ఇదే స‌మ‌యంలో శ‌శి త‌ల్లిదండ్రులు బంధువుల ఇంట్లో పెళ్లి కోస‌మ‌ని వెళ్తారు. శ‌శి వాళ్ల ఇంట్లో ఉంటే సుర‌క్షితంగా ఉంటానని మ‌ద‌న్ అనుకుంటాడు. కానీ వారికి అనుకోని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. అవి ఏమిటో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

 

ప్ల‌స్ పాయింట్స్:
శ‌శి మ‌థ‌నంలో ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ ల కెమిస్ట్రీ సూప‌ర్బ్ గా కుదిరింది. యూట్యూబ్ ఆడియెన్స్ ను ఈ ఇద్ద‌రు త‌మ ప‌ర్ఫార్మెన్స్ ల‌తో ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్నారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో మ‌రోసారి త‌మ కెమిస్ట్రీతో ఆడియెన్స్ ను ఆక‌ట్టుకుంటారు. వారి మ‌ధ్య వచ్చే ఫ‌న్నీ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తాయి.

కామెడీ సీన్స్ చాలా చ‌క్క‌గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. క‌న్ఫ్యూజ‌న్ కామెడీతో ఆడియెన్స్ ను ఆక‌ట్టుకుంటాయి. క‌థ కొత్త‌దేమీ కాక‌పోయినా, ఇందులోని డైలాగ్స్, డ్రామా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయి. సోనియా సింగ్ తండ్రి పాత్ర‌లో న‌టించిన ప్ర‌దీప్ రాప‌ర్తి త‌న‌దైన డైలాగ్ డెలివ‌రితో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు.

 

మైన‌స్ పాయింట్స్:
ఈ క‌థను ఇంకాస్త ఆస‌క్తిక‌రంగా మ‌లిచి ఉంటే శ‌శి మ‌థ‌నం మంచి ఎంట‌ర్టైన‌ర్ గా నిలిచేది. ఈ రొమాంటిక్ కామెడీ క‌థ‌లో కామెడీ, ఎమోష‌న్ల‌ను సరిగా ఎగ్జిక్యూట్ చేయ‌లేక‌పోయారు. కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి. ఈ క‌థ ముగింపు కూడా చాలా డ‌ల్ గా ఉంటుంది.

ఇక కామెడీ విష‌యానికి వ‌స్తే కొన్ని చోట్ల ప్రేక్ష‌కుల‌ను నవ్వించిన‌ప్ప‌టికీ, మ‌రికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. రైటింగ్ టీమ్ ఇంకాస్త ఇంట్రెస్ట్ పెట్టి ఉంటే, కామెడీ సీన్స్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యేవి.

రెండో ఫీమేల్ లీడ్ కు సంబంధించిన ట్రాక్ కేవ‌లం రన్ టైమ్ కోసమే పెట్టిన‌ట్లుగా అనిపిస్తుంది. క‌థ‌లో రెండో ల‌వ్ ట్రాక్ కు సంబంధించిన అంశం బాగున్న‌ప్ప‌టికీ, అది క‌థ‌కు చాలా వ‌ర‌కు డ్యామేజ్ చేసింద‌నే చెప్పాలి. ఇలాంటి కొన్ని అంశాలు ఈ క‌థ‌కు మైనస్ గా నిలిచాయి.

 

సాంకేతిక విభాగం:
సింజిత్ యెర్ర‌మిల్లి సంగీతం బాగుంది. పాట‌లు చ‌క్క‌గా కుదిరాయి, బీజీఎం కూడా ఆక‌ట్టుకుంది. రెహాన్ షేక్ సినిమాటోగ్ర‌ఫీ కూడా బాగుంది. త‌క్కువ బ‌డ్జెట్ లో తెర‌కెక్కించిన‌ప్ప‌టికీ, ఈ వెబ్ సిరీస్ లోని నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ వ‌ర్క్ ప‌ర్వాలేదు.

మేక‌ర్స్ ఈ వెబ్ సిరీస్ ను సింపుల్ గా తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ అదే మేజ‌ర్ డ్రాబ్యాక్ గా నిలిచింది. ఎమోష‌న్స్ స‌రిగా పండ‌క‌పోవ‌డంతో ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ అనుకున్న‌మేర ఆక‌ట్టుకోలేక‌పోయింది. ద‌ర్శ‌కుడు వినోద్ గాలి కొన్ని మంచి మూమెంట్స్ ను పెట్టే ప్ర‌య‌త్నం చేసినా, అవి పూర్తి స్థాయిలో ఎంట‌ర్టైన్ చేయ‌లేక‌పోయాయి.

 

తీర్పు:
మొత్తంగా శ‌శి మ‌థ‌నం లో కొన్ని ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు ఉన్న‌ప్పటికీ, పూర్తిస్థాయిలో అవి మెప్పించలేక‌పోయాయి. ప‌వ‌న్ సిద్దు, సోనియా సింగ్ ల కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. కొన్ని కామెడీ సీన్స్ న‌వ్వించ‌లేక‌పోయాయి. బ‌ల‌మైన ఎమోష‌న‌ల్ సీన్స్ లేక‌పోవ‌డంతో ఈ వెబ్ సిరిస్ ఆశించిన స్థాయిలో అల‌రించ‌లేక‌పోతుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు