రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ”ఉషా ప‌రిణ‌యం”

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ”ఉషా ప‌రిణ‌యం”

Published on Jul 8, 2024 3:31 PM IST

టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ చిత్రాల‌తో ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు కె.విజ‌య్ భాస్క‌ర్. ఆయ‌న చేసిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవడంలో మంచి విజ‌యాల‌ను అందుకున్నాయి. ఆయ‌న తెరకెక్కించిన నువ్వే కావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్స్ బాక్సాఫీస్ దగ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఆయ‌న డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ”ఉషా ప‌రిణ‌యం” ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది.

విజ‌య్ భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో విజ‌య్ భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా ఇండ‌స్ట్రీకి పరిచ‌యం అవుతున్నాడు. ఉషా ప‌రిణ‌యం చిత్రానికి ”లవ్ ఈజ్ బ్యూటిఫుల్” అనేది ట్యాగ్ లైన్ గా పెట్టారు. ఇక ఈ సినిమాను అన్ని ఎమోష‌న్స్ క‌లిగిని ల‌వ్ స్టోరీగా చిత్ర యూనిట్ రూపొందించింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు.

ఆగ‌స్టు 2న ”ఉషా ప‌రిణ‌యం” చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ సినిమాలో తాన్వి ఆకాంక్ష అనే తెలుగ‌మ్మాయి హీరోయిన్ గా పరిచ‌యం అవుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. ఈ సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు